హీరో,హీరోయిన్లు, నటులు ఒక సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడానికి అనేక రకాలుగా ఆలోచిస్తారు. డైరెక్టర్లు వచ్చి కథలు చెప్పినప్పుడు ఇది తమకు సూట్ అవుతుందా..? లేదా? అనేది అంచనా వేస్తారు. ఈ పాత్ర చేస్తే తర్వాతి సినిమాలపై ఏమైనా ప్రభావం పడుతుందా..? పాత్రను మనం చేయగలమా? అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ కథ నచ్చకపోయినా? లేదా పాత్ర చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్లకు నో చెబుతారు. స్టార్ హీరోలు సైతం కథలను ఎంచుకునే సమయంలో అనేక పాత్రలకు నో చెబుతారు.
ఒక హీరో నో చెప్పిన కథలను మరో హీరోకు డైరెక్టర్లు వినిపిస్తారు. ఇలాంటి సమయంలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో ఎంచుకుని సినిమా చేయడం, బ్లాక్ బస్టర్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చిరంజీవి వద్దనుకున్న ఒక కథతో మంచు మోహన్ బాబు సినిమా తీసి సక్సెస్ కొట్టాడు. జగదేకవీరుడు అతిలోకసుదరి సినిమా తర్వాత అల్లుడుగారు అనే సినిమా టైటిల్ తో ఒక కథను చిరంజీవికి రాఘవేంద్రరావు వినిపించారు.
కానీ సినిమా క్లైమాక్స్ లో హీరోకు ఉరిశిక్ష పడుతుంది. ఇది చిరంజీవికి నచ్చలేదు. తన అభిమానులకు ఇది నచ్చదని రిజెక్ట్ చేశారు. ఈ సినిమా కధను తర్వాత మోహన్ బాబుకు రాఘవేంద్రరావు వినిపించారు. దీంతో మోహన్ బాబు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాతో మోహన్ బాబు హిట్ అందుకున్నాడు. ఇందులో శోభన, సత్యనారాయణ, చంద్రమోహన్ లాంటి నటులు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు.
లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత ఈ సినిమాను చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. మోహన్ బాబు బాగా నటించాడని, పాత్ర సరిగ్గా సరిపోయిందని ప్రశంసించారు. అప్పట్లో హీరోలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు.