News' భ‌గ‌వంత్ కేస‌రి ' సెన్సార్ విష‌యంలో ఈ మ్యాజిక్ చూశారా......

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ సెన్సార్ విష‌యంలో ఈ మ్యాజిక్ చూశారా… క్రేజీ అప్‌డేట్ ఇది..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భారీ యాక్షన్ సినిమా భగవంత్‌ కేసరి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, టీజర్లు.. ట్రైలర్లతోపాటు సాంగ్స్ అన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి అంచనాలకు మించి ఉండడంతో సినిమాపై హైప్‌ మామూలుగా లేదు.

దసరా కానుకగా భగవంత్‌ కేసరి ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 155 నిమిషాలుగా ఉండనుంది. ఇది చాలా క్రీస్పీ ర‌న్ టైం అని చెప్పాలి. ర‌న్ టైం ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు సెన్సార్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. దీంతో భగవంత్ కేసరికి సెన్సార్ వాళ్లు ఒక కట్‌ కూడా చెప్పలేదట.

బాల‌య్య లాంటి యాక్ష‌న్ హీరో చేసిన సినిమా జీరో క‌ట్స్‌తో బ‌య‌ట‌కు రావ‌డం నిజంగా మ్యాజిక్ అని చెప్పాలి. ఈ సినిమాని మేకర్స్ ఎలా అయితే సెన్సార్ కి పంపించారో.. అలాగే క్లీన్ గా సెన్సార్ జీరో కట్స్ తో చేసుకొని బ‌య‌ట‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ / ఏ సర్టిఫికెట్ అందించారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించ‌గా.. యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ముఖ్యపాత్రలో నటించింది. తమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ ఈ సినిమాను నిర్మించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news