Moviesఇప్పటి వరకు ఏ మహిళా చేయని పని చేసిన స్నేహ..అరుదైన ఘనత..అదృష్టం...

ఇప్పటి వరకు ఏ మహిళా చేయని పని చేసిన స్నేహ..అరుదైన ఘనత..అదృష్టం అంటే ఇదే..!!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరుస్తుందో ఎవ్వరు చెప్పలేరు . కొన్ని కొన్ని సార్లు అది మనకు తెలియకుండానే మన వెనక వచ్చేస్తూ ఉంటుంది. మరి కొన్నిసార్లు మనకంటే ముందు వెళ్లి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. అలాంటి ఓ అదృష్టాన్ని స్నేహ చాలా చిన్న ఏజ్ లోనే అందుకుంది . స్నేహ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతమైన అనుభూతి ఉంది . ఎంతో ప్రసిద్ధి చెందిన మధురై మీనాక్షి ఆలయంలోని కలశాన్ని తాకిన మొదటి మహిళగా స్నేహ రికార్డులు క్రియేట్ చేసింది .

గుణసేన దర్శకత్వంలో హీరో ప్రశాంత్ సరసన స్నేహ నటించిన సినిమా విరువం. ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది స్నేహ . ఈ సినిమా చాలావరకు మధురై లోని మీనాక్షి అమ్మవారు ఆలయంలో షూట్ చేశారు. మీనాక్షి అమ్మవారు ఆలయంలోని గోపురం పైన ఉన్న కలశాన్ని తాకిన దృశ్యం ఒకటి ఉంటుంది. సాధారణంగా మధురై మీనాక్షి అమ్మ దేవాలయం గోపురం కలిశాని ఏ స్త్రీ తాకలేదు .

కానీ ఓ సన్నివేశం కోసం డైరెక్టర్ ఇలా ప్లాన్ చేశాడు. ఆలయ నిర్వాహకులు సైతం ఓకే చెప్పడంతో స్నేహ ఆ కలశాన్ని తాకింది. అయితే అప్పటివరకు ఎవరు చేయని పనిని స్నేహ చేసింది. అమ్మవారి ఆలయ గోపుర కలిశాన్ని తాకిన తొలి మహిళగా స్నేహ చరిత్ర సృష్టించింది . ఇదే విషయాన్ని పూజారి దర్శకుడుకు వివరించగా దర్శకుడు స్నేహకు వివరించారు . స్నేహ చాలా చాలా సంతోషించింది కలిశాన్ని పట్టుకున్న తర్వాత కిందకు రాగానే గుడి పూజారి స్నేహను నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మ అంటూ ఆశీర్వదించారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news