ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బుల్లితెర యాంకర్ రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే ఇప్పటికే సోషల్ మీడియాలో చాలాసార్లు శ్రీముఖి పెళ్లి వార్త వైరల్ అయింది .
అయితే ఎప్పటికప్పుడు ఆమె క్లారిటీ ఇస్తూనే వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే.. నేనే మీకు చెప్తాను అంటూ అఫీషియల్ గా కూడా ప్రకటించింది . అయితే ఈసారి శ్రీముఖికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట. అది కూడా వాళ్ళ నాన్న వాళ్ళ ఆనందం కోసం. అందరి ఇంట్లో ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు .
నువ్వు మాకు ఆ ఆనందాన్ని ఎప్పుడు ఇస్తావ్ శ్రీముఖి అంటూ నాన్న అడగడంతో నాన్న కోరిక ప్రకారమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో త్వరలోనే శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్న న్యూస్ ఫ్రెండ్స్ వద్ద నుంచి సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది..!!