టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గత కొంతకాలంగా అటు ఇండస్ట్రీలో హీరోలకు.. దర్శకులకు, నిర్మాతలకు, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లకు కూడా బాగా టార్గెట్ అవుతూ వస్తున్నారు. ఎక్కువ సినిమాలు ఒప్పుకోవటం.. గతంలోలా శ్రద్ధతో పని చేయకపోవడంతో తమన్ అనుకున్నంత అవుట్ పుట్ ఇవటం లేదు. అలవైకుంఠపురంలో – అఖండ లాంటి ఒకటి రెండు సినిమాలు వదిలేస్తే తమన్ పెద్ద సినిమాలు కూడా మంచి అవుట్ పుట్ ఇవ్వటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
స్కంద సినిమాలో కొన్ని విమర్శలు వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంతమంది బాగుందంటే.. మరికొందరు బాగోలేదని కామెంట్ చేశారు. చివరకు బోయపాటి కూడా తమన్ వర్క్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు అఖండ సినిమాలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చూసినా తాను తీసిన సీన్లు అంతే హై రేంజ్ లో ఉంటాయని చెప్పారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. తర్వాత తమన్ బోయపాటికి కౌంటర్గా అరవింద సమేతలో తాను కంపోజ్ చేసిన సౌండ్ ట్రాక్ ను తాజాగా ట్వీట్ చేస్తూ.. ఫ్రీ హ్యాండ్ ఉంటే తాను ఎంతో గొప్పగా వర్క్ చేస్తానని బోయపాటికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
దీంతో బోయపాటి వర్సెస్ తమన్‌ను అంటూ చాలా కథనాలు వచ్చాయి. అదే టైంలో బ్రో ఐ డోంట్ కేర్ అంటూ నర్మగర్భంగా కొన్ని కామెంట్లు కూడా చేశాడు. అయితే ఇప్పుడు ఈ విషయంలోకి అనిల్ రావిపూడి ఎంటర్ అయ్యాడు. పూర్తిస్థాయిలో తమన్‌ను వెనకేసుకొచ్చాడు. ఏ టెక్నీషియన్ అయినా సినిమా కంటెంట్ ఆధారంగా పనిచేస్తాడు.. చెడగొట్టాలని ఎవరూ పని చేయరు.. ఒక్కోసారి బాగా కనెక్ట్ అయితే బాగా కొట్టొచ్చు.. లేకపోతే యావరేజ్ మ్యాజిక్ ఇస్తారని చెప్పారు.
సినిమా చాలా బాగుంది డార్లింగ్ .. చాలా మంచిగా కొడతాను వదిలేయ్ అన్నాడని.. నేను అతడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను.. ప్రతి సీన్ చూసి బయటకు వస్తూ హగ్ చేసుకుంటున్నాను.. అద్భుతమైన పాట కావాలంటే వెయిట్ చేయాలి కదా.. నేను అలా వెయిట్ చేశానని అనిల్ చెప్పాడు. అనిల్ థమన్‌ను ఇంతగా ఆకాశానికి ఎత్తేయడం వెనక పరోక్షంగా ఇటీవల అన్న బోయపాటి మాటలను దృష్టిలో పెట్టుకునే కౌంటర్ ఇచ్చాడంటున్నారు. అలాగే వర్క్ ఎలా చేయించుకోవాలన్నది కూడా బోయపాటికి తెలియదన్నట్టుగా కూడా అనిల్ రావిపూడి మాటల్లో ధ్వనిచిందన్న గుసగుసలు కూడా నడుస్తున్నాయి.