Moviesఫైనల్లీ తెలుగు సినిమా కి సైన్ చేసిన కీర్తి సురేష్.. మరో...

ఫైనల్లీ తెలుగు సినిమా కి సైన్ చేసిన కీర్తి సురేష్.. మరో మహానటిలాంటి సినిమా పక్క..రాసి పెట్టుకోండి..!!

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు పాపం మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ .. భారీ అంచనాలతో భారీ భారీ ఆశలతో భోలా శంకర్ సినిమాలో నటించింది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకోవడమే కాకుండా ఆ సినిమాలో సిస్టర్ రోల్ లో కనిపించిన కీర్తి పాత్రను మరింత నెగటివ్ కామెంట్స్ అందుకునింది .

ఈ క్రమంలోనే తీవ్రంగా హర్ట్ అయిన కీర్తి సురేష్ .. తెలుగులో సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయిపోయిందట . అందుకే బాలీవుడ్ చెక్కేసింది . అక్కడ ఏకంగా రెండు బడా ప్రాజెక్ట్స్ లో భాగమైంది .. ఎక్స్పోజింగ్ చేయడానికి సైతం సిద్ధపడింది . ఇలాంటి క్రమంలోనే తెలుగులో మరో మంచి ఆఫర్ రావడంతో కోపంలో ఏదో అనేసాను అనుకోని ఆ ప్రాజెక్టు పై సైన్ చేసేసింది కీర్తి సురేష్.

చందు మొండిటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అయితే రెండవ హీరోయిన్గా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందట . పాత్ర చాలా మంచిది కావడంతో ఒప్పుకునిందట. అంతేకాదు ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చచ్చిపోతుంది. ఎమోషనల్ టచ్ అద్భుతంగా ఉంటుంది. అందుకే మరో మహానటి లాంటి హిట్ తన ఖాతాలో పడుతుంది అని అమ్ముడు ఈ సినిమాకు సైన్ చేసిందట . చూద్దాం ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో కీర్తి సురేష్ కి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news