Newsనాని త‌న‌కు న‌చ్చిన హీరోయిన్ల‌ను ఇలాక్కూడా వాడతాడా... అబ్బో మామూలోడు కాదే..!

నాని త‌న‌కు న‌చ్చిన హీరోయిన్ల‌ను ఇలాక్కూడా వాడతాడా… అబ్బో మామూలోడు కాదే..!

ఎస్ ఈ టైటిల్ నూటికి నూరు శాతం నానికి వర్తిస్తుంది. నానికి ఎవరైనా ఒక హీరోయిన్ నచ్చితే వారికి రిపీటెడ్ గా తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇది నిజం కూడా..! చాలామంది హీరోయిన్లు నాని సినిమాలలో వరుసగా అవకాశాలు సంపాదించారు. కీర్తి సురేష్ – నిత్యామీనన్ – నివేద థామస్ – సాయి పల్లవి వంటి నటీమణులు నాని సినిమాలలో మళ్లీ మళ్లీ కనిపించారు. సినిమాలలో మాత్రమే కాదు.. బయట కూడా ఈ హీరోయిన్లతో నానికి మంచి స్నేహం ఉంది.

నానికి ఒక హీరోయిన్ తో స్నేహం ఏర్పడితే అది అలా కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఇప్పుడు ఇదే జాబితాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు ? నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుల్‌ మోహన్. నాని కోప‌రేష‌న్ లేక‌పోతే ఆమె ఈ సినిమా ఛాన్స్‌ అయితే దక్కించుకోలేదు. అయితే ప్రియాంకకు తమిళంలో మంచి అవకాశాలే వచ్చాయి. ముందుగా క‌న్న‌డ‌ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంకను తెలుగులోకి తీసుకువచ్చింది నానియే.

ఈ సినిమా తర్వాత నాలుగేళ్ల పాటు ప్రియాంక అరుల్‌ మోహన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా టైంలోనే నాని హీరోయిన్గా మరో అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాడట. నానికి ప్రియాంకకు మధ్య ఎక్కడో కుదిరింది. అంతే ఇప్పుడు తన తాజా సినిమా సరిపోదా శనివారంలో ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఇదంతా నాని సిఫార్సుల మేరకే దక్కింది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రియాంకను తెలుగు కన్నడలో అందరూ మర్చిపోయిన టైంలో ఆమెకు పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు నాని. ప్రియాంక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు నాని సినిమాలో కూడా ఛాన్స్ రావడంతో తెలుగులో అయినా ఆమె పంట పండుతుందేమో చూడాలి. ఏది ఏమైనా నాని ఒక చూపు చూసాడు అంటే చాలు..ఫేడ‌వుట్ అవుతున్న హీరోయిన్లకు కూడా ఎలాంటి ? గోల్డెన్ ఛాన్సులు వస్తాయో ప్రియాంకకు వచ్చిన అవకాశమే పెద్ద నిదర్శనం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news