Newsకాజ‌ల్ కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశం... భ‌ర్త‌, కొడుకుతో క‌లిసి పూజ‌లు (ఫొటోలు)

కాజ‌ల్ కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశం… భ‌ర్త‌, కొడుకుతో క‌లిసి పూజ‌లు (ఫొటోలు)

తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. అక్కడ నుంచి ఆమె తెలుగులో వెనక్కి తిరిగి చూసుకోలేదు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమా మగధీరతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ తర్వాత స్టార్ హీరోలు అందరితో నటించింది. ఇప్పుడు సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ హీరోయిన్‌గా మారిపోయింది.

తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన భగవంత్‌ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి తర్వాత ఆమె ఆచార్య సినిమాతో రీయంట్రి ఇవ్వాల్సి ఉండగా చివరలో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

ఈ సినిమా హిట్ అవడంతో కాజల్‌కు తెలుగులో సీనియర్ హీరోల పక్కన మరిన్ని ఛాన్సులు రానున్నాయి. ఇక కాజల్ 2020లో తన చిన్ననాటి ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రియుడుతో పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు ఆమె వెండితెరకు దూరమైంది. గత యాడది లోనే ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి నీల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం మళ్ళీ సినిమాలతో బిజీగా ఉంటున్నా ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది.

తన భర్త, కుమారుడితో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ తన ఇన్స్టాలో నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవటం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మా పవిత్రమైన కుటుంబం కోసం మంచి ఇల్లు కొనుగోలు చేశాను.

ఈ ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఇది మేము ప్రేమతో కట్టుకున్న ఇల్లు.. ఆ దేవుడు ఆశీర్వాదంగా భావిస్తున్నా.. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి అని పోస్ట్ చేసింది. కాజల్‌ పెట్టిన ఈ పోస్ట్ కు పలువురు సినీ తారలు, కాజల్ అభిమానులు కాజల్ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news