Newsవ‌రుణ్‌తేజ్ - లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో ఇన్ని ట్విస్టులా... చూశారా...!

వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో ఇన్ని ట్విస్టులా… చూశారా…!

మెగా వారసుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో నవంబర్ 1న జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ హీరో హీరోయిన్ల ఎంగేజ్మెంట్ ఇప్పటికే జరిగింది. ఇక ఇటలీలో జరిగే ఈ పెళ్ళికి మెగా కుటుంబ సభ్యులు.. అటు లావణ్య కుటుంబ సభ్యులు అంతా ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. పెళ్లికి ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో మిగిలిన వారంతా కూడా ఈరోజు బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది.

ముందుగా వెళ్లిన చరణ్, బన్నీ దంపతులు.. నిహారిక పెళ్లి తంతుకు సంబంధించి కార్యక్రమాలు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక లావణ్య వైపు నుంచి కూడా కుటుంబ సభ్యులు.. ఆమె స్నేహితులు కూడా ఇప్పటికే ఇటలీ వెళ్లారు. మొత్తంగా పెళ్లి కార్యక్రమాలు రెండు కుటుంబాలు కలిసి చూసుకుంటున్నారని చెప్పాలి. ఈ వివాహానికి ఇటు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరవుతున్నారు.

ఇటలీలోని టుస్కానీ న‌గ‌రంలో ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంది. అయితే ఈ పెళ్లి నాలుగు రోజుల పాటు వేడుక‌గా జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 30 రాత్రి సంగీత్ పార్టీ చేసుకుంటారు. అక్టోబ‌ర్ 31 ఉద‌యం హ‌ల్దీ వేడుక‌లు, సాయంత్రం మెహందీ వేడుక నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబ‌ర్ 1న పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. అనంత‌రం ఇట‌లీ నుంచి తిరిగి వ‌చ్చాక న‌వంబ‌ర్ 5న హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ నిర్వ‌హిస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news