తమిళ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన నటీనటుల్లో ఎంజీఆర్, జయలలిత కూడా ఉంటారు. వీరిద్దరు కేవలం సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా తిరుగులేని విధంగా చక్రం తిప్పారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధంపై రకరకాల పుకార్లు షికారులు చేశాయి. ఎంజీఆర్ నిజంగానే జయలలితను పెళ్లి చేసుకున్నారు అన్న టాక్ కూడా 1980ల్లో వచ్చింది. అసలు జయలలిత సినిమా ప్రస్థానం మొదలుపెట్టింది ఎంజీఆర్ తోనే..!
ఎంజిఆర్తో కలిసి జయలలిత దాదాపు 32 కు పైగా సినిమాలలో నటించారు. వీరిద్దరి బంధంపై అప్పట్లో తమిళ్ మీడియాలో ఎన్నో వార్తలు పుకార్లు షికార్లు చేసేవి. అయితే వీరిద్దరూ ఎప్పుడు వీటిని ఖండించలేదు. దీంతో అంతా నిజమే అని భావించారు. ఎంజీఆర్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోతే.. రెండో భార్య అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ తర్వాత జానకికి అప్పటికే పెళ్లయ్యి ఒక బాబు ఉన్నా కూడా ఆమెను ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఎంజీఆర్.
అంటే జానకికి ఎంజీఆర్ రెండో భర్త కావడం విశేషం. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడో భార్య జానకి ఉండగానే జయలలితని ఎంజీఆర్ ఎందుకు ? పెళ్లి చేసుకున్నారు అన్న సందేహాలు అప్పట్లో చాలామందికి వచ్చాయి. ఇక జయలలిత ఎంజీఆర్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్నది కూడా అప్పట్లో గట్టిగా వినిపించిన మాట. అయితే వాస్తవంగా వీరిద్దరి మధ్య పెళ్లి జరగలేదు.. కానీ వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్య బంధం ఉందనేది వాస్తవం. అప్పట్లో ఇది అందరికీ తెలిసిన మాటే..!
ఎంజీఆర్ ప్రైవేట్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా మూడో భార్య జానకిని కాకుండా జయలలితను తీసుకొని వెళ్లేవారు. జయలలిత ఎంజిఆర్ పక్క పక్కనే కూర్చునేవారు. దీంతో ఎంజీఆర్ జయలలితను నాలుగో పెళ్లి చేసుకున్నాడు అన్న ప్రచారం అప్పట్లో గట్టిగా వినిపించింది. ఈ ప్రచారాన్ని జయలలిత గాని అటు ఎంజీఆర్ కానీ ఎప్పుడూ ఖండించలేదు.