Newsఈ ముదురు హీరోయిన్‌ను టాలీవుడ్‌లో ఏ హీరో ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు...!

ఈ ముదురు హీరోయిన్‌ను టాలీవుడ్‌లో ఏ హీరో ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు…!

మ‌న సీనియర్ హీరోలకి ఎప్పుడూ కుర్రభామలే జతగా స్క్రీన్ మీద కనిపించాలి. వాళ్ళ వయసు 50, 60 ఏళ్ళు ఉన్నా వాళ్ళ పక్కన నటించే హీరోయిన్స్ మాత్రం 30 లోపే ఉండాలి. అప్పుడే ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. 50 ఏళ్ళు పైబడిన హీరోలు ఫైట్స్ చేస్తుంటారు. హీరోయిజం చూపిస్తుంటారు. అదే 50 ఏళ్ళు ఉన్న హీరోయిన్ మాత్రం పక్కన నటించడానికి పనికిరాదు. ఒకవేళ 40 ఏళ్ళ పైబడిన హీరోయిన్ ని తీసుకున్నా చెన్నకేశవ రెడ్డి, అందరివాడు లాంటి సినిమాలలో టబు చేసిన నాసిరకం పాత్రలు చేసి ఊరుకోవాల్సిందే.

ఈ విషయంలో చాలావరకూ బాలీవుడ్ హీరోయిన్స్ బెటర్ అని చెప్పాలి. వాళ్ళు ఏజ్ కి తగ్గ హీరోతో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. అదే ముదురు భామలు మాత్రం మళ్ళీ మన టాలీవుడ్ హీరోలకి పనికిరావడం లేదు. హిందీలో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్స్ మన సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఎందుకో ఉపయోగపడటం లేదు. గత కొంతకాలంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రవితేజ లాంటి సీనియర్స్ కి హీరోయిన్స్ దొరకడం లేదు.

రవితేజ, శ్రీలీల వంటి నాజూకు పండుతో సరసాలాడుతున్నాడు. కొన్ని సీన్స్ ఇంత ఏజ్ గ్యాప్ ఉండటంతో చాలా చండాలంగా ఉంటోంది. బాలీవుడ్ లో బాగా అనిపించేది సోనాక్షి సిన్హా. ఈ భామ మన సీనియర్ హీరోలందరికి సూటవుతుంది. బాలీవుడ్ లో ముదురు భామగా కనిపించే సోనాక్షికి అక్కడ అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఛాన్స్ ఇచ్చారు. హిట్స్ కూడా సోనాక్షి ఖాతాలో చాలానే ఉన్నాయి. హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.

చాలాసార్లు మన టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. కనీసం ఐటెం సాంగ్ కోసం అయినా మన మేకర్స్ సోనాక్షిని పట్టుకొస్తారని జనాలు ఆశపడ్డారు. కానీ, ఇప్పటి వరకూ ఆ ఛాన్స్ సోనాక్షికి దక్కలేదు. సౌత్ లో రజినీకాంత్ సరసన నటించింది. కానీ, ఆ సినిమా ఫ్లాపయింది. అదే సమయంలో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ, ఎందుకనో సోనాక్షి మాత్రం తెలుగులో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తన తర్వాత వచ్చిన ఊర్వశీ రౌతెలా మాత్రం ఇక్కడ ఐటెం సాంగ్స్ తో ఊపు ఊపేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news