Moviesసౌత్ ఇండస్ట్రీని మడతపెట్టేస్తున్న అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.....

సౌత్ ఇండస్ట్రీని మడతపెట్టేస్తున్న అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. అందుకేనా ఇంత బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ యువత చెప్పే ఒకే ఒక్క పేరు అనిరుధ్ రవీ చంద్రన్. తమిళ్ స్టార్ హీరోలు అందరికీ సినిమాలలో గుర్తుండిపోయే పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్న అనిరుధ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటే అందరికీ బాగా సుపరిచితమైన పేరే .

అయితే అనిరుధ్ ఏం చదువుకున్నాడు..? ఎందుకు ఇంత బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు..? అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు . మరీ ముఖ్యంగా వై దిస్ కొలవరి అనే సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అనిరుధ్ దాదాపు 50 సినిమాలకు సంగీతం దర్శకత్వం వహించాడు. ఇంత చిన్న ఏజ్ లోనే ఇలాంటి ఓ అరుదైన ఘనత అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా రికార్డులు క్రియేట్ చేశాడు . సాధారణంగా సంగీత దర్శకులు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని వివిధ సంగీత వాయిద్యాలు నేర్చుకొని మ్యూజిక్ డైరెక్టర్స్ గా మారుతారు.

అందరు కూడా ఇవన్నీ చేశాడు. అయితే వీటితో పాటు కొన్ని కోర్సులు కూడా ఎక్స్ట్రాగా చేసాడు ఈ అనిరుధ్. ఓ పక్క చదువుకుంటూ ఓ పక్క సంగీతం నేర్చుకుంటూనే మరోపక్క మ్యూజిక్ కి సంబంధించిన కోర్సులు అన్ని కంప్లీట్ చేశారు. లండన్ లో ఫేమస్ మ్యూజిక్ కాలేజీ ట్రినిటీలో పియానో నేర్చుకొని.. అక్కడ ఫ్యూజన్ బ్యాండ్ లో కూడా పనిచేశాడు . అనంతరం చెన్నైలో సౌండ్ ఇంజనీరింగ్ గా కోర్స్ ని పూర్తి చేశాడు . ఇలా అన్ని కోర్సులు పూర్తిచేయబట్టే ఇంత బాగా మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news