Newsబాల‌కృష్ణ‌కు నచ్చిన ఈ త‌రం హీరో ఎవ‌రు... శ్రీలీల ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్...

బాల‌కృష్ణ‌కు నచ్చిన ఈ త‌రం హీరో ఎవ‌రు… శ్రీలీల ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది. సినిమాకు తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్ వచ్చినా కూడా రోజురోజుకు అనూహ్యంగా పుంజుకుంటుంది. విచిత్రం ఏంటంటే తొలి రోజు కంటే ఆరో రోజు షేర్ ఎక్కువగా ఉండటంతో ట్రేడ్ వర్గాలకు కూడా దిమ్మతిరిగినట్లు అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల‌ బాలయ్యను ఇంటర్వ్యూ చేసింది.

ఇది ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ గా సాగింది. శ్రీలీల వేసిన పలు ప్రశ్నలకు బాలయ్య తనదైన శైలిలో దొరకకుండా ఆన్సర్లు చేశారు. మీకు నచ్చిన సినిమాలు ఏవి ? అంటూ శ్రీలీల అడిగిన ప్రశ్నల‌కు బాలకృష్ణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. తాను చేసిన చాలా సినిమాలలో అన్నింటికీ ఒకేలా కష్టపడతానని బాలయ్య చెప్పారు.

తనకు నచ్చని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని తనకు ఎంతో నచ్చిన సినిమాలు ఫ్లాప్‌లు కూడా అయ్యాయని బహుశా వాటికి పెట్టిన ముహూర్త బలం సరిగా లేక అవి ఆడకపోయి ఉండొచ్చు అని బాలయ్య చెప్పారు. బాలయ్యకు ముందు నుంచి ఈ ముహూర్తాల మీద ఏ స్థాయిలో నమ్మకం ఉందో తెలిసిందే. తాజాగా అదే విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక ఈ తరం జనరేషన్ హీరో హీరోయిన్లలో మీకు నచ్చిన వారు ఎవరు ? అన్న ప్రశ్నకు కూడా బాలయ్య సూటిగా సమాధానం ఇవ్వలేదు.

ఇప్పుడు ఉన్న యువతరం హీరోలలో అందరూ బాగానే చేస్తారు అని చెప్పారు. ఒక్కో పాత్రకు ఒక్కొక్కరికి సూట్ అవుతుందని.. ఎవరికి వారు తమ సినిమాలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారని బాల‌య్య‌ చెప్పారని తెలిపారు. అంతేతప్ప ప్రత్యేకంగా ఒక హీరోనో లేదా హీరోయిన్ పేరు బాలయ్య చెప్పలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news