టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగ నాగార్జున ఎంతమంది డైరెక్టర్లతో వర్క్ చేసినా రాఘవేంద్రరావు గారు కాంబో అంటే మాత్రం చిన్న పెద్ద ముసలి వాళ్లు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు.
అలాంటి ఓ క్రేజీ కాంబో వీళ్లది . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా రాఘవేందర్రావు ఎంత కమిట్మెంట్ గల వ్యక్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన అనుకున్నా విధంగా సినిమా రావాలి .. వచ్చేలాగా ఎంత కష్టమైనా పడతాడు. ఈ క్రమంలోనే ఓ రోల్ కోసం నాగార్జునను వెయిట్ పెరగమంటూ సజెస్ట్ చేశారట .
కానీ నాగార్జున సినిమా షూట్ సమయానికి రాఘవేంద్రరావు గారు చెప్పినంత వెయిట్ రాలేకపోయాడట . దీంతో చేసేది ఏమీ లేక ఆయన అనుకున్న పాత్ర ఆ విధంగా వచ్చేటట్లు షార్ట్ లోపల ప్యాంట్ లోపల దూది పెట్టారట. అప్పుడు నాగార్జున కొంచెం బొద్దుగా కనిపించారు . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు సాధించాడు రాఘవేంద్రరావు..!!