శ్రీ లీల .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే బాగా గట్టిగా వినిపిస్తుంది. అంతేకాదు ఆమె నటించిన సినిమాలు సైతం అదే రేంజ్ లో ఆడుతూ ఉండడంతో జనాలు ఎక్కువగా ఆమెతోనే సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా ఆమె నటించిన సినిమా భగవంత్ కేసరి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుక గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న హనుమకొండలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు .
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ బాలయ్యకు మరో హిట్ పక్కన అని కన్ఫామ్ చేసింది . కాగ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలయ్య కాజల్, శ్రీ లీల చాలా అట్రాక్టివ్ గా కనిపించారు. ముగ్గురు ట్రెడిషనల్ బట్టల్లో చాలా మెరిసిపోయారు. అయితే బాలయ్య – కాజల్ కి మించిన రేంజ్ లో శ్రీ లీల అట్రాక్టివ్ నెస్ ఎక్కువగా ఉంది . పట్టు పరికిణిలో చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించింది .
దీంతో శ్రీ లీల వేసుకున్న డ్రెస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు ఇది ప్యూర్ కాంచీవరం పట్టు పావడగా తెలుస్తుంది . ఈ పట్టు పావడాను శ్రీలీలకు గిఫ్ట్ చేసింది కూడా బాలయ్యనే.. షూట్లో ఉన్నప్పుడు శ్రీలీల పుట్టినరోజు కు గిఫ్ట్ చేశారట. దీంతో అచ్చ తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఆమె కు పావడ గాజులు, పూలు, తాంబూలం అందజేశాడట. దీంతో ఫిదా అయిపోయిన శ్రీ లీల ఖచ్చితంగా అది మంచి ఈవెంట్ కి కట్టుకోవాలి అంటూ డిసైడ్ అయిందట . అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి శ్రీ లీల ఇలా బాలయ్య ఇచ్చిన పట్టుపరికిణి నే కట్టుకుని వచ్చింది..!!