News' భ‌గ‌వంత్ కేస‌రి ' లో శ్రీలీల రోల్ ఇదే.. షూటింగ్‌లో...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ లో శ్రీలీల రోల్ ఇదే.. షూటింగ్‌లో బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేసిందా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటించింది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్ లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్‌ నిర్వహించారు. ఈ సినిమాలో తన పాత్ర ఏంటో కూడా శ్రీలీల‌ లీక్ చేసేసింది.

సినిమాలో తాను వరంగల్ పిల్లగా.. విజ్జిపాపగా నటించాను.. ఇంతటి గొప్ప సోల్ కనెక్ట్ ఉన్న క్యారెక్టర్ అనిల్ రావిపూడి గారు నాకు ఇచ్చారు.. ఆయనకు బిగ్ థాంక్స్ అని తెలిపింది. ఇక బాలకృష్ణ గారితో నాకు ఎమోషనల్ టైం ఉంది.. ఆయనతో కలిసి పనిచేయటం అనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో కొన్ని సీన్లు చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పిన కూడా తాను అదే మూడ్లో కంటిన్యూ అయ్యాను. ఆ సీన్ నుంచి వెంటనే బయటికి రాలేకపోయాను.. అంత గొప్పగా ఈ సినిమాతో తాను కనెక్ట్ అయ్యానని శ్రీ లీల ఎమోషనల్ అయింది.

అలాంటి సందర్భాలలో బాలయ్య గారు నన్ను నవ్వించి నార్మల్ స్టేజ్ కి తీసుకువచ్చేవారు.. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు… ఈ సినిమాలో బాలయ్య గారికి నాకు మధ్య ఎన్నో బ్యూటిఫుల్ సీన్లు ఉన్నాయి… కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి… బాలయ్య గారు నా లైఫ్ లో మర్చిపోలేని అనుభవాలను ఈ సినిమా ద్వారా అందించారని తెలిపింది.

ఇది ఆయన మంచి మనసుకు నిదర్శనం అంటూ శ్రీ లీల ఎమోషనల్ అయింది. ఏది ఏమైనా శ్రీ లీల చెప్పిన మాటలను బట్టి చూస్తే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో అంతా బాగా కనెక్ట్ అయిపోయారని తెలుస్తోంది. మరి రేపటి రోజున థియేటర్లలో భగవంత్ కేసరి వీర విహారం ఎలా ?ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news