నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా..కన్నడ బ్యూటీ అన్న సంగతి అందరికీ తెలిసిందే . కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించి అక్కడ వచ్చిన క్రేజ్ తో తెలుగులోను అవకాశాలు దక్కించుకొని చలో సినిమా ద్వారా పాపులారిటీ దక్కించుకుంది . ఆ తర్వాత అమ్మడు ఏ రేంజ్ లో మారిపోయిందో మనం చూసాం. గీతగోవిందం , సరిలేరు నీకెవ్వరు ,పుష్ప వంటి సినిమాలలో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది .
అయితే రష్మిక మందన్నా.. తెలుగు ఇండస్ట్రీలో నటించే ప్రతి సినిమాకు కామన్ గా ఒక కండిషన్ పెడుతూ వస్తుందట . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసేటప్పుడు మాత్రం ఆ కండిషన్ పెట్టదు . దానికి రీజన్ కూడా చెప్తూ క్లారిటీ ఇచ్చింది . రష్మిక తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా కాల్ షీట్స్ అడుగుతుంటారట. ఒకప్పుడు టైం తీసుకుని తర్వాత కాల్ షీట్స్ అడుగుతూ ఉంటారని ..కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం టైం అంటే టైం.. ఫాలో అవుతూ ఉంటారని..
వాళ్ళు పలానా డేట్స్ లో కాల్ షీట్స్ అడిగారంటే.. ఆ డేట్ ఫిక్స్ అయినట్లే అని.. కానీ తెలుగు డైరెక్టర్స్ మాత్రం ఈరోజు అడిగి పది రోజుల తర్వాత ఆ సినిమాను తెరకెక్కిస్తారని.. అందుకే ఒక సినిమాకి కమిట్ అయ్యేముందే ఖచ్చితంగా ఈ తేదీల్లోనే కాల్ షీత్స్ ఇవ్వగలను అని ఫిక్స్ చేసుకున్నాక రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకుంటుందట. అడ్వాన్స్ కూడా ఆ టైంకే తీసుకుంటుందట. ప్రతి సినిమాకు రష్మిక ఇలాగే చేస్తూ ఉండడం గమనార్హం. దీంతో తెలుగు డైరెక్టర్ ల పై రష్మికకు ఇంత నమ్మకం అంటుంటే.. బాలీవుడ్ కి మనకి అదే తేడా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు..!!