కొన్నిసార్లు మనం ఊహించడమే జరుగుతూ ఉంటాయి . ఎదుటివారిని మనం ఎంత ప్రేమించిన ఎంత నమ్మకం పెట్టుకున్నా ఎక్కడో ఒక భయం ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు సైతం అదే భయాన్ని తన భార్య విషయంలో వ్యక్తం చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది. నమ్రత మహేష్ బాబుది ప్రేమ వివాహం .
అది అందరికీ తెలిసిందే. వీళ్ళకి ఇద్దరు పిల్లలు గౌతం – సితార . ఇద్దరు కూడా చదువుకుంటున్నారు . అయితే మహేష్ బాబు నమ్రత ను పెళ్లి చేసుకునే ముందే పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా సినిమాలు చేయకూడదు అంటూ కండిషన్ పెట్టారట . మహేష్ బాబు పై ఉన్న ఇష్టంతో ప్రేమతో నమ్రత సైతం దానికి ఓకే చేసింది. అయితే ఎక్కడ నమ్రత మళ్లీ మనసు మార్చుకుంటుందో వరుసగా ఆఫర్లు వస్తున్న మూమెంట్లు ఆమె రూల్స్ ని బ్రేక్ చేస్తుందో అన్న భయంతో గౌతమ్ ని త్వరగా కనడానికి ప్లాన్ చేసుకున్నాడట మహేష్ బాబు.
ఓ బిడ్డ పుట్టాక హీరోయిన్గా చేయాలి అన్న ఆలోచనలు రావు అని .. తమ మధ్య ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటూ గౌతమ్ ని త్వరగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేశారట . అయితే ఇదే విషయం ఆ తర్వాత నమ్రత తెలిసి తెగ నవ్వుకునిందట. మహేష్ ఇలా కూడా ఆలోచించాడా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసినట్లు ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది . అయితే ఇచ్చిన మాటను తప్పని నమ్రత ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఇక కనిపించకూడదు అని ఆమెకు ఆమె ప్రామిస్ చేసుకుందట..!!