నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. బాలయ్యకు జోడి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటించారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు మంచి టాక్ సొంతం చేస్తుంది. అయితే బాలయ్య గత రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు అఖండ – వీర సింహారెడ్డి రేంజ్ లో భగవంత్ కేసరికి టాక్ రాలేదన్న చర్చ అయితే ముందు నుంచి నడిచింది.
విచిత్రం ఏంటంటే ఈ సినిమా రోజురోజుకు అనూహ్యంగా పుంజుకుంటుంది. మూడవరోజు వసూళ్లు బాగా పెరిగాయి. ఈ సినిమా మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా 71 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మేకర్స్ ఈ విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. మూడోరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రు. 10.65 కోట్ల రూపాయలు షేర్ రాబట్టింది. రెండో రోజు కంటే మూడో రోజు షేర్ వసూళ్లు పెరగటం ఈ సినిమాకు రోజురోజుకు క్రేజ్ ఎలా ? పెరుగుతుందో చెప్పేందుకు ఉదాహరణ.
అటు ఓవర్సీస్ లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటికే 850 కే డాలర్ల వసూళ్లు సొంతం చేసుకుంది. ఏది ఏమైనా భగవంత్ కేసరి ఫస్ట్ వీక్ ముగిసేసరికి రు. 100 కోట్ల దాటేసి రు.110 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు కొలగొడుతుంది అన్న లెక్కలు వేస్తున్నారు. మరో నాలుగు రోజులు దసరా సెలవులు ఉండటం కూడా ఈ సినిమాకు కలిసి రానుంది.
ఏదేమైనా బాలయ్య గత రెండు సినిమాల వసూళ్లతో పోల్చి చూసి భగవంత్ కేసరి పనైపోయిందని విమర్శించిన వారు ఇప్పుడు డే 2 కంటే డే 3కు ఎక్కువ షేర్ రావడంతో షాక్ అవుతున్నారు.