Newsదగ్గుబాటి అభిరామ్‌పై పెద్ద రూమ‌ర్‌... ఆ కాంట్ర‌వ‌ర్సీపై ఫ‌స్ట్ టైం నోరు...

దగ్గుబాటి అభిరామ్‌పై పెద్ద రూమ‌ర్‌… ఆ కాంట్ర‌వ‌ర్సీపై ఫ‌స్ట్ టైం నోరు విప్పాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ మొఘల్‌గా దగ్గుబాటి రామానాయుడు పేరు తెచ్చుకున్నాడు. రామానాయుడు ఫ్యామిలీ నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండో కుమారుడైన దగ్గుబాటి అభిరామ్ కూడా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అహింస మూవీతో ఇతడు సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమయ్యాడు. అయితే ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అభిరామ్ వెండితెరపై కనిపించిన దాఖలాలు లేవు.

అభిరామ్ సినిమాలకు సంబంధించిన విషయాల కంటే అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా వచ్చాయి. అతడి పై ఎన్నో ఆరోపణలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. అతని క్యారెక్టర్ బాగోలేక కుటుంబం వెలేసినట్లు కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే అభిరామ్ తొలిసారిగా ఈ రూమర్స్ పై స్పందించాడు.

హైదరాబాద్ సిటీలో రైటర్స్ కేఫ్ అనే ఒక కేఫ్ లాంచ్ చేసినట్లు వెల్లడించాడు. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువకులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేఫ్ ప్రారంభించినట్లు తెలిపాడు. తన చుట్టూ అలుముకున్న పలు కాంట్రవర్సీల గురించి కూడా మాట్లాడాడు.

“లైఫ్ అసలు ఈజీగా ఉండదు. తాతయ్య చనిపోయాక నాలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. జీవితం విలువ ఏంటో కూడా అప్పుడే తెలిసింది. అప్పటినుంచి బాధ్యతగా ఉండాలనుకున్నా. సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నా. ఆ ఆలోచన నుంచి పుట్టిందే రైటర్స్ కేఫ్. ఇక కాంట్రవర్సీల గురించి మా కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు నన్ను దూరంగా పెట్టినట్లు పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదు. అవన్నీ అవాస్తవాలే!” అని దగ్గుబాటి అభిరామ్ పేర్కొన్నాడు.

అలాగే అహింస సినిమా తర్వాత తనకి ఎన్నో అవకాశాలు వచ్చాయని కానీ ఫస్ట్ సినిమా తీశాక నటుడిగా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయం తనకు బోధపడిందని వెల్లడించాడు. “అందుకే అవకాశాలు వచ్చినా పర్ఫెక్ట్ యాక్టింగ్ నేర్చుకునేంత వరకు దేన్నీ ఒప్పుకోలేదు. ప్రేమ సినిమాలు చేయాలని ఉంది కానీ కొంతకాలం వెయిట్ చేయమని దర్శక నిర్మాతలకు చెప్పా.” అని అభిరామ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అభిరామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచి సినిమాతో మళ్లీ తమ ముందుకు రావాలని అభిమానులు ఈ సందర్భంగా తమ కోరికను వ్యక్తపరిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news