Newsచిరంజీవికి - ఎన్టీఆర్‌కు బాక్సాఫీస్ వార్ ఫిక్స్‌... విన్న‌ర్ ఎవ‌రో నెల...

చిరంజీవికి – ఎన్టీఆర్‌కు బాక్సాఫీస్ వార్ ఫిక్స్‌… విన్న‌ర్ ఎవ‌రో నెల రోజుల్లో తేలిపోతోందిగా…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య నెల రోజుల్లోనే అదిరిపోయే బాక్సాఫీస్ వార్‌ జరగనుంది. అదేంటి చిరంజీవి కొత్త సినిమా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఎన్టీఆర్ దేవర ఎప్పుడో వచ్చే యేడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. మరి ఈ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం ఏంటి ?అనుకున్నారా టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాలు ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.

బిజినెస్‌మేన్ – పోకిరి – ఖుషి అంటే మూడు నాలుగు సినిమాలు వదిలేస్తే మిగిలిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. రీసెంట్గా వచ్చిన ఛ‌త్రపతి అయితే ఘోరంగా దెబ్బతింది. అసలు ఈ సినిమాని ప్రభాస్ అభిమానులు కూడా పట్టించుకోలేదంటే రీ రిలీజ్ సినిమాల ట్రెండ్‌ ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఇక రిలీజ్ సినిమాలు ఆపేస్తే బెటర్ అనుకుంటున్న టైంలో మరో రెండు సినిమాలు ధియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో ఒకటి చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్.

ఈ రీమిక్స్ సినిమాను ఈ వీకెండ్ రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రైలర్ కూడా కట్ చేశారు. ఈ ట్రైలర్ నాగబాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈనెల లోనే రిలీజ్ కు రెడీ అయిన మరో సినిమా జూనియర్ ఎన్టీఆర్ హిట్ సినిమా అదుర్స్. ఎన్టీఆర్ ద్విపాత్ర వినయంతో వివి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 18న రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ నుంచి సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజులైంది. అందుకే అదుర్స్ సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. అందుకే నిర్మాతలు కూడా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏకంగా 400 థియేటర్లలో ప్రసారం చేశారు. ఇలా నవంబర్ నెలలో అటు చిరంజీవి హిట్ సినిమా.. ఇటు ఎన్టీఆర్ హిట్ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.

మరి ఈ రెండు సినిమాలలో కలెక్షన్ల పరంగా ఎవరు ? పై చేయి సాధిస్తారు అన్నది ఈ నెలాఖరుకు తేలిపోనుంది. ఈ రెండు సినిమాలలో కనీసం ఒక్కటే హిట్ అయినా సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది.. లేకపోతే ఈ ట్రెండ్‌ను ఇక్కడితో ఆపేయటం బెటర్ అన్న చర్చ‌ కూడా మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news