దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి దుబాయ్ లోని హోటల్లో కొన్నేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే బాత్ టబ్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే శ్రీదేవి భర్త బోని కపూర్ పై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. మరియు ముఖ్యంగా దుబాయ్ పోలీసులు బోనీపై మరింత డౌట్ పడ్డారు. శ్రీదేవి మృతి తర్వాత తన భార్య మృతిపై ఎప్పుడు స్పందించలేదు బోని.
భార్య లేని లోటును.. ఆ బాధను మాత్రమే వ్యక్తం చేస్తూ వచ్చాడు. అయితే ఇన్నాళ్లకు శ్రీదేవి మరణంపై తన అనుమానాలను బయట పెట్టాడు బోని. శ్రీదేవి ఎప్పుడు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుందట. ఉప్పు, కారం లేని ఆహారం తీసుకుంటుందట. అది కూడా చాలా తక్కువ మోతాదులో అని.. అందుకే కొన్నిసార్లు ఆమె కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుందని చెప్పాడు.
శ్రీదేవి తరచూ ఆకలితో అలమటించేది.. అందంగా కనిపించడం కోసం మంచి ఆకృతిలో ఉండటం కోసం శరీరాన్ని కష్టపెట్టేది.. ఈ క్రమంలోనే శ్రీదేవికి లో బీపీ ఉంది.. ఆహార నియమాన్ని సడలించాలని వైద్యులు ఎన్నోసార్లు చెప్పినా ఆమె వినలేదు.. శ్రీదేవి మరణం యాక్సిడెంట్ అంటూ తన భార్య మృతి పై తొలిసారి స్పందించాడు బోని. ఆమె చనిపోయే టైంలో కూడా కఠినమైన డైట్ లో ఉందట. అందువల్లే కళ్ళు తిరిగి బాతు టబ్‌లో పడిపోయి ఉంటుందని బోనీ అనుమానం వ్యక్తం చేశారు.
శ్రీదేవి మరణం తర్వాత బోనీని దుబాయ్ పోలీసులు ఏకంగా 24 గంటల పాటు ప్రశ్నించారు. ఇండియా మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉందని కాబట్టి ప్రశ్నించక తప్పదని చెప్పారట. అక్కడితో ఆగకుండా బోనికపూర్ కు లైట్ డిటెక్టర్ పరిక్షలు కూడా చేశారు. అలా పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిందని దుబాయ్ పోలీసులు నివేదిక ఇచ్చారని బోనీ తెలిపాడు. ఏదేమైనా తనపై వస్తున్న చాలా అనుమానాలకు బోనీ ఇప్పుడు స్పందించి ఇలా వివరణ ఇచ్చుకున్నట్టుగా కనిపించింది.