Newsమ‌హేష్‌బాబు ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో... మాన‌స్ ఎంట్రీ ఫిక్స్‌...!

మ‌హేష్‌బాబు ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో… మాన‌స్ ఎంట్రీ ఫిక్స్‌…!

టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం మహేష్ బాబు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. తండ్రి కృష్ణ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇటు మహేష్ బాబు స్టార్ హీరోగా ఉండగా.. కృష్ణ బావమరిది సుధీర్ బాబు కూడా టాలీవుడ్ లో హీరోగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎవరు వస్తారు ? అన్న ప్రశ్నకు మహేష్ బాబు వారసుడు గౌతమ్ తప్ప మరో వ్యక్తి వచ్చే అవకాశం లేదని అందరూ అనుకుంటున్నారు.

కానీ మహేష్ కొడుకు కంటే ముందే మరొక వ్యక్తి ఆ కుటుంబం నుంచి హీరోగా వచ్చే అవకాశం ఉంది. ఆ వారసుడు ఎవరో కాదు ? సుధీర్ బాబు తనయుడు మానస్‌. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మూడు నాలుగు యేళ్ల‌లో అతడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతాడని కూడా సుధీర్ బాబు స్వయంగా చెప్పాడు.

మా పెద్దబ్బాయి మానస్‌ చాలా క్లారిటీతో ఉన్నాడు.. వాడు సినిమాల్లోకే వస్తాడు వాడే నటిస్తున్నాడు.. వీడియోలు తీస్తున్నాడు.. ఎడిటింగ్ చేస్తున్నాడు.. జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు అతడు సరైన మార్గంలోనే వెళుతున్నాడు.. అన్ని రంగాల్లో కష్టపడుతున్నాడు.. నాటకాలు వేయడంతో పాటు యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నాడు.. వాడికి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్.. మరో నాలుగేళ్లలో కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడని సుధీర్ బాబు చెప్పాడు.

ప్రస్తుతం సుధీర్ బాబు వయసు 15 ఏళ్ళు. మరో నాలుగు ఐదు ఏళ్లలో అతడు కచ్చితంగా సినిమాల్లోకి హీరోగా వస్తాడని సుధీర్ బాబు చెప్తున్నాడు. ఏది ఏమైనా మహేష్ బాబు కొడుకు గౌతమ్ కంటే.. సుదీర్ బాబు తనయుడు మాన్‌ ముందుగా సినిమాలోకి వచ్చేలా ఉన్నాడు. ఇక మహేష్ బాబు సినిమాలలో గౌతమ్ నటించినట్టుగానే.. సుధీర్ బాబు సినిమాలలో అతడి కుమారుడు కూడా నటించాడు అదే మాయ మ‌శ్చీంద్ర‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news