Newsవెంక‌టేష్ - రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో మిస్ అయిన బ్లాక్‌బస్ట‌ర్ ఇదే..!

వెంక‌టేష్ – రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో మిస్ అయిన బ్లాక్‌బస్ట‌ర్ ఇదే..!

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన వెంకటేష్ గత కొన్నేళ్లుగా మల్టీ స్టార‌ర్ సినిమాలలో నటించేందుకు ఆసక్తి చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – రామ్ – రానా – నాగచైతన్య లాంటి హీరోలతో కలిసి వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలలో నటించి సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు.

ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో నటించిన హిట్ సినిమాలలో గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా వెంకటేష్ – రామ్ చరణ్ కాంబినేషన్లో రావాల్సి ఉన్నా అలా జరగలేదు. కృష్ణవంశీ ముందుగా సీనియర్ హీరో శ్రీకాంత్ పోషించిన పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ ని అడిగారు.

అయితే ఆ పాత్ర వెంక‌టేష్‌కు ఎందుకో గాని న‌చ్చ‌లేదు. ఈ పాత్ర చేయ‌లేన‌ని ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకి చెప్పేశారు. దీంతో ఆ ప్లేస్లో సీనియర్ హీరో శ్రీకాంత్‌ను తీసుకున్నారు. శ్రీకాంత్ మొండి బాబాయ్ పాత్రలో ఎలా ఒదిగిపోయారో చూసాం. బండ్ల గణేష్ నిర్మాత వ్యవహరించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ – కమలిని ముఖర్జీ – జయసుధ తదితరులు కీలకపాత్రలో పోషించారు.

2004 అక్టోబర్ ఒకటైన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించుకుంది. కృష్ణ‌వంశీకి చాలా రోజుల త‌ర్వాత మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news