Newsఅసలు గేమ్ మొదలు పెట్టిన బిగ్ బాస్.. హౌస్ మేట్ భార్యనే...

అసలు గేమ్ మొదలు పెట్టిన బిగ్ బాస్.. హౌస్ మేట్ భార్యనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇప్పుడు ఆటలో అసలు మజా..!!

బిగ్బాస్ సీజన్ సెవెన్ ఎంత రసవత్తరంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అనుకున్న టాప్ కంటెస్టెంట్ కంటే ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వస్తూ ఉండడంతో షోపై ఇంకా ఆసక్తి నెలకొంటుంది . కాగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మహానటి రతిక ఎలిమినేట్ అయినట్లు చాలామంది కన్ఫర్మ్ అయిపోయారు . ఆమె చేసిన ఓవర్ యాక్టింగ్ భరించలేక రైతు బిడ్డను దూరం పెట్టి మోసం చేసిన కారణంగానే జనాలు ఆమెకు తక్కువ ఓట్లు చేసి ఆమెను హౌస్ నుంచి బయటికి పంపించేశారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే ఆమె ప్లేస్ లోకి హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న అమర్ దీప్ భార్య తేజు గౌడ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. రీసెంట్ గానే అమర్ దీప్ తేజు గౌడ పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి . అయితే బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారమే హౌస్లో అమర్ దీప్ భార్యను ఎంట్రీ ఇప్పించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కాగా రతిక హౌస్ నుంచి బయటకు రావడానికి కారణం కూడా అమర్ దీప్నే అంటూ గట్టిగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇలాంటి టైం లో తేజు గౌడ నే హౌస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తే అసలు ఆట మొత్తం రివర్స్ అయిపోతుందని .. బిగ్ బాస్ ఉల్టా పల్టా అంటే ఇదే అంటూ బిగ్ బాస్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఆటలో అసలు మజా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై తేజు గౌడ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news