టాలీవుడ్లో వచ్చే సంక్రాంతికి ఇప్పటికే మహేష్‌బాబు గుంటూరు కారం సినిమా లైన్లో ఉంది. అలాగే రవితేజ ఈగిల్, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్ సినిమాలు కూడా రిలీజ్ లైన్లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ పోటీలోకి బాలయ్య భగవంత్ కేసరి కూడా చేరింది. అయితే పైన చెప్పుకున్న హీరోల సినిమాలు అన్ని థియేటర్లలోకి వస్తుంటే.. అదే టైంలో బుల్లితెరపై సందడి చేయడానికి భగవంత్ కేసరి రెడీ అవుతుంది.
ఇప్పటికే థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా నడిచిన ఈ సినిమా సంక్రాంతికి టీవీల్లో సందడి చేయబోతుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ ఛానల్ సంక్రాంతికి ఈ సినిమాను టెలీకాస్ట్ చేయబోతుంది. అయితే ఈ సినిమా బుల్లితెర ప్రసారానికి డిజిటల్ స్ట్రీమింగ్‌తో లింక్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు భగవంత్ కేసరి డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఆమోజాన్లో స్ట్రీమింగ్ కు వచ్చిన నెల రోజుల్లో టీవీల్లో ఈ సినిమాని ప్రసారం చేయాల్సి ఉంది.
ఈ లెక్కన చూసుకుంటే ఓటీటీలో ఈ సినిమా నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే సరికొత్త విలక్షణ సినిమాగా నిలిచిపోయింది. తన ఇమేజ్ స్టైల్ కు భిన్నంగా బాలయ్య చేసిన ఈ సినిమా ఇప్పటికే 135 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.
ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. అటు అనిల్ రావిపూడి తన హిట్టు ట్రాక్ అలాగే కొనసాగిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలయ్యకు కూతురు వరుస పాత్రలో శ్రీలీల నటించింది. వెండితెరపై అదిరిపోయే రికార్డులు కొల్లగొట్టిన భగవంత్ కేసరి బుల్లితెరపై ఎలాంటి ?మ్యాజిక్ చేస్తాడో చూడాలి.