నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య – విజయ్ వారసుడు సినిమాలు పోటీలో ఉన్నా కూడా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ దగ్గర వీర విహారం చేసింది. మళ్ళీ ఇప్పుడు దసరా కానుకగా మూడు సినిమాల పోటీలో బాలయ్య వస్తున్నాడు. బాలయ్య భగవంత్ కేసరి – విజయ్ లియో – రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి.
సంక్రాంతికి బాలయ్య ఎలా అయితే ముక్కోణపు పోటీ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు దసరాకు కూడా అలాగే ముక్కోణపు పోటి ఎదుర్కొంటున్నాడు. సంక్రాంతికి బాలయ్యతో పోటీపడ్డ విజయ్ ఇప్పుడు దసరాకు కూడా మరోసారి పోటీ పడుతున్నాడు. ఈ సినిమాకు గతేడాది విక్రమ్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో లియోపై తెలుగు నాట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు తెలుగులో 22 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కావడంతో పాటు రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఇచ్చిన సినిమా కావడంతో ఆ సినిమా కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ మూడు సినిమాలలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు భగవంత్ కేసరి కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ల తర్వాత నటించిన సినిమా. ఇటు ఏడాదికేడాదికి అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజీ డబుల్ అవుతుంది. పైగా టాలీవుడ్ లో ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి ఈ సినిమా ఏడవది. కాజల్ అగర్వాల్, శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్లు సినిమాలో ఉన్నారు.
పైగా శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో ఎలాంటి ఫామ్ లో ఉందో చూస్తున్నాం. థమన్ సంగీత దర్శకత్వం ఇవన్నీ ఈ సినిమా రేంజ్ ను ఎక్కడకో తీసుకువెళ్లాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు కూడా అదిరిపోయాయి. మాస్ ప్రేక్షకులతో పాటు.. ఇటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్.. కామెడీ సీన్స్.. ఎమోషనల్ పవర్ఫుల్ డైలాగులు, ఊహించని ట్విస్టులు, బాలయ్య – కాజల్ లవ్ ట్రాక్… అలాగే బాలయ్య – శ్రీలీల మధ్య వచ్చే తండ్రీ, కొడుకుల ఎమోషనల్ సీన్లు ఇవన్నీ సినిమాకు ప్లస్ కానున్నాయి.
టైగర్ నాగేశ్వరరావు సీరియస్ మూవీ కావడంతో బీ, సీ సెంటర్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ ?చేసుకుంటారో చూడాలి. ఇక లియో సినిమా లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన మూవీ కావడంతో యునానమస్ పాజిటివ్ టాక్ వస్తేనే తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఏది ఏమైనా పండగ సినిమా అనే పదానికి భగవంత్ కేసరి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. మరి రేపు రిలీజ్ అయ్యాక ఈ మూడు సినిమాలలో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.