Newsవీక్ డే టెస్ట్‌లో ' భగవంత్ కేసరి ' అరాచకం.. బాలయ్య...

వీక్ డే టెస్ట్‌లో ‘ భగవంత్ కేసరి ‘ అరాచకం.. బాలయ్య కుమ్ముడే కుమ్ముడు..!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఇటు తమిళ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలు పోటీలో ఉన్నా కూడా భగవంత్ కేసరి ఈ దసరాకు క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పటికే దాదాపు 80% రికవరీ సాధించిన ఈ సినిమా మరో 3 – 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేయనుంది.

ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ .58 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భగవంత్ కేసరిలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా శ్రీలీల కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ నటించారు. ఇప్పటికే దసరా సెలవులు పూర్తయ్యాయి. గురువారం నుంచి ఈ సినిమాకు వీక్ డే స్టార్ట్ అయింది.

విచిత్రం ఏంటంటే దసరా సెలవులు అయిపోయాక వీక్ డేస్ లో కూడా భగవంత్ కేసరి మంచి కలెక్షన్లు అందుకుంటుంది. ఏ, బి సెంటర్లు, సి సెంటర్లు తేడా లేకుండా అన్ని ఏరియాలోను భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ గా దూసుకు వెళ్తోంది. సీడెడ్ లో ఇప్పటికే కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఆంధ్రాలో, నైజాంలో వసూళ్లు స్ట్రాంగ్ గా ఉండటం విశేషం.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మరింత ఆదరణ లభిస్తోంది. దసరా సెలవులు అయిపోయాక వీక్లీ టెస్ట్ లో పాస్ అయిన భగవంత్ కేసరి మరో వారం రోజులపాటు బాక్సాఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాంగ్‌ర‌న్లో ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సులువుగా దాటేస్తుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news