Newsఆ హీరోయిన్ మోసం వ‌ల్లే బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హీరోయిన్ ఎంగేజ్మెంట్ బ్రేక‌ప్‌...!

ఆ హీరోయిన్ మోసం వ‌ల్లే బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హీరోయిన్ ఎంగేజ్మెంట్ బ్రేక‌ప్‌…!

ప్రేమలో పడటం.. సహజీవనాలు చేయటం బ్రేకప్ లు చెప్పుకోవటం ఇప్పుడు చాలా కామన్. ఇక సినిమా రంగంలో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. అయితే 1990వ‌ ద‌శ‌కంలో హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడి బ్రేకప్ లు చెప్పుకోవడం అరుదుగా జరుగుతూ ఉండేది. ఒక హీరోయిన్‌కు స్టార్ హోదా వచ్చాక.. మరో స్టార్ హీరోతో ప్రేమలో పడి సహజీవనం చేసింది. వీరిద్దరూ ఒకరిని ఒకరు అమితంగా ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.

అంతలోనే ఇద్దరు మధ్య ఏం ?జరిగిందో కానీ బ్రేకప్ జరిగింది. తర్వాత ఇద్దరు ఎవరి దారి వారు చూసుకుని వేరే పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోలో స్థిరపడ్డారు. ఇంత‌కి వారిద్దరు ఎవరో కాదు 1991లో స్టార్‌ హీరో, హీరోయిన్లుగా వెలుగొందిన అక్షయ్ కుమార్, రవీనా టాండన్. వీరిద్దరూ క‌లిసి మెహ్రా సినిమాలో నటించారు. ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్లాలని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే టైంలో అక్షయ్ కుమార్ కు అమ్మాయిల కలల రాకుమారుడు అన్న పేరు ఉండేది.

రవీనా టాండన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకొని.. మరో హీరోయిన్ శిల్పాశెట్టితో ప్రేమాయణం నడిపాడు. శిల్పా శెట్టి- అక్షయ్ కుమార్ ను మైకంలో ప‌డేయ‌డంతో రవీనా టాండన్‌ను క్రమక్రమంగా వదిలించుకోవాలన్న ఆలోచనకు వచ్చేసాడు. ఈ విషయం తెలిసిన రవీనా- అక్షయ్‌కు దూరమైంది. ఇక్క‌డ‌ విచిత్రం ఏంటంటే ఆ తర్వాత అక్షయ్ కుమార్- శిల్పాశెట్టిని కూడా వదిలేసి మరో హీరోయిన్ ట్వింకిల్ కన్నా మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఆ తర్వాత రవీనా 2004లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ త‌డానీని పెళ్లి చేసుకుంది.

ఈ దంపతులకు రాషా థడానీ, రణబీర్‌వ‌ర్థ‌న్‌ సంతానం. అయితే పెళ్లికి ముందే 1995లో ప్రవీణ, పూజ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి త‌ల్లి అయింది. ర‌వీనా తెలుగులో కూడా బాలయ్యతో బంగారు బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో న‌టించింది. అలాగే నాగార్జునతో ఆకాశ వీధిలో సినిమాలో నటించింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 లో రమ్మిక‌ సేన్ పాత్రలో నటించి మళ్లీ సౌత్ ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news