News' స్కంద‌ ' లో ఆ పాత్ర మిస్ అయిన బాల‌య్య‌.....

‘ స్కంద‌ ‘ లో ఆ పాత్ర మిస్ అయిన బాల‌య్య‌.. ఇదేం ట్విస్ట్ బాబు…!

టాలీవుడ్ యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన స్కంద‌ ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమాకి మిక్స్ డ్‌ టాక్ వ‌చ్చినా వ‌సూళ్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. బోయ‌పాటి మార్క్ మాస్ న‌చ్చే వాళ్లు స్కంద‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్కంద‌లో రామ్ ద్విపాత్రాభిన‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. క్లైమాక్స్‌లో అనూహ్యంగా రెండో రామ్ పాత్ర ఎంట్రీ ఉంటుంది.

రెండో హీరోయిన్ స‌యి మంజ్రేక‌ర్ పాత్రకు జోడీగా రెండో రామ్ పాత్ర ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ క‌థ రాసుకునే టైంలో ద‌ర్శ‌కుడు బోయ‌పాటికి ధ్యాస లేదు. రెండో రామ్ పాత్ర‌లో బాల‌య్య వ‌స్తే బాగుంటుంద‌ని అనుకున్నాడ‌ట‌. ఈ విష‌యం బాల‌య్య వ‌ర‌కు వెళ్లింది. బోయ‌పాటి అంటే బాల‌య్య‌కు ఎంత అభిమాన‌మే తెలిసిందే. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో క‌నిపించ‌డ‌నికి బాల‌య్య కూడా ఓకే చెప్పాడు.

ఈ సినిమాలో బాల‌య్య పాత్ర‌ను క్లైమాక్స్‌లో ఇంట్ర‌డ్యూస్ చేయాల‌న్న‌దే బోయ‌పాటి ప్లాన్‌. ఇది మంచి డెసిష‌న్‌. త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ చేస్తోంది ఇదే. ఓ సినిమాలో చిన్న పాత్ర‌ను చూపించి.. దాని చుట్టూ మంచి క‌థ అల్లి త‌ర్వాత సినిమాలు చేస్తున్నారు. ఖైదీ, విక్ర‌మ్ స్టైల్ అదే. స్కంద‌లో క్లైమాక్స్‌లో రెండో రామ్ పాత్ర‌లో బాల‌య్య‌ను చూపించి.. ఆ పాత్ర చుట్టూనే బాల‌య్య త‌ర్వాత సినిమా క‌థ అల్లుకుందామ‌ని బోయ‌పాటి అనుకున్నాడ‌ట‌.

అయితే ఈ ప్లాన్ చివ‌ర్లో వ‌ర్క‌వుట్ కాలేద‌ట‌. చివ‌ర‌కు అదే పాత్ర‌ను కూడా రామ్‌తో చేయించి డ్యూయ‌ల్ రోల్ తో స‌రిపెట్టేశారు. చివ‌ర్లో నిజంగా బాల‌య్య వ‌చ్చి ఉంటే స్కంద సినిమాకు చాలా ప్ల‌స్ కావ‌డంతో పాటు ఈ సినిమా రేంజ్ మ‌రోలా ఉండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news