Movies"గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు".. స్టేజీ పైనే సంచలన విషయానికి బయటపెట్టిన...

“గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు”.. స్టేజీ పైనే సంచలన విషయానికి బయటపెట్టిన బాలయ్య..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు అది ఎక్కడైనా సరే ఎంతటి పెద్ద వ్యక్తుల ముందు అయినా సరే .. రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సైతం బాలయ్య అలాగే ఓపెన్ గా మాట్లాడాడు . ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత స్టేజి పైకి ఎక్కిన బాలయ్య తన స్పీచ్ తో అభిమానులను బాగా ఆకట్టుకున్నాడు .

మరీ ముఖ్యంగా బాలయ్య మాట్లాడిన ప్రతి పదం అభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయింది. బాలయ్య మాట్లాడుతూ..” నేను మొట్టమొదటిసారి తెలంగాణ మండలికంలో మాట్లాడడం అఖండ తర్వాత ఏం చేస్తాము అనుకున్న తరుణంలో వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ పడడం ..ఆ తర్వాత భగవంత్ కేసరి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అనిల్ నా దగ్గరికి కథ తీసుకొని వచ్చినప్పుడు కామెడీగా చేద్దామా ..? యాక్షన్ జోనర్ లో చేద్దామా..? అంటే నేను కామెడీనే అని చెప్పాను.

నాలోను కమెడియన్ ఉన్నాడు అంటూ ప్రూవ్ చేసుకున్నాను . తెలంగాణ సీమసింహాన్ని.. సీమసింహాన్ని ..బొబ్బిలి పులి సీమసింహాన్ని ..రాయలసీమ సింహాన్ని టోటల్గా తెలుగు సినిమా సింహాన్ని అంటూ తనదైన స్టైల్ లో అదరగొట్టేసాడు. అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీల ప్రతిసారి నన్ను చిచ్చా చిచ్చా అంటూ పిలుస్తుంది. నెక్స్ట్ సినిమా హీరోయిన్ గా తీయ్యాలి అనుకుంటున్న..ఇదే విషయాన్ని మా ఇంట్లో వాళ్లకి చెప్పా గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అంటూ మోక్షజ్ఞ నన్ను తిట్టాడు . ఇంట్లో నేను కుర్ర హీరోగా రావడానికి రెడీగా ఉంటే నువ్వు ఆమెతో చేస్తావా..? అంటూ పరోక్షంగా శ్రీ లీల మోక్షజ్ఞ సినిమాను కన్ఫామ్ చేసేసాడు బాలయ్య . ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news