నందమూరి నటసింహ బాలకృష్ణ సినిమాల విషయంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఒక సినిమాలో ఒక పాత్రలో ఆయన నటిస్తున్నారు అంటే ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తారు. అఖండ – వీరసింహారెడ్డి సినిమాలలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఇక తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. కాజల్ అగర్వాల్ – శ్రీలీల బాలయ్యతో తొలిసారిగా నటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రముఖ టాలీవుడ్ నటుడు అప్పాజీ అంబరీష్ ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటించానని.. ఎన్టీఆర్ కథానాయకుడు క్లైమాక్స్‌లో నా పాత్ర ఎంట్రీ ఉంటుందని.. మహానాయకుడులో నా పాత్ర ఫుల్ లెన్త్ రోల్ అని తెలిపారు. నేను సినిమాలో జీవన్ రెడ్డి పాత్రలో నటించానని.. ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో నన్నపనేని రాజకుమారి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ ముందు గాజులు పగలగొట్టారని.. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాల గురించి అప్పాజీ కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య ముందు గాజులు పగలగొట్టి ఉమ్మివేయాలని.. ఆ పాత్ర చేయడానికి నటీమణులు భయపడుతున్నారని అప్పాజీ గుర్తు చేసుకున్నారు. అయితే బాలయ్య ఆ పాత్రలో చేస్తోన్న నటీమణితో పాటు మిగిలిన నటీనటులకు ధైర్యం చెప్పి మనం చరిత్రలో జరిగింది చేస్తున్నాం.. ఏం ఆలోచించకుండా చేయాలని నిజంగానే గాజులు పగలగొట్టండి.. ఉమ్మినట్టు నటించవద్దు ఉమ్మివేయాలని కోరారని అప్పాజీ అంబరీష చెప్పుకొచ్చారు. బాలయ్య అలా చెప్పడంతో తామంతా ఆశ్చర్యపోయినట్టు ఆయన తెలిపారు.
బాలయ్యను నేను దమ్ముంటే కొట్టరా అని అనాలని.. నేను ఒక్క షాట్లో చేయడంతో చాలా బాగా చేస్తున్నావు అంటూ బాలయ్య తనను ఎంకరేజ్ చేసినట్టు అప్పాజీ అంబరీష పేర్కొన్నారు. ఒరిజినల్ అసెంబ్లీలో ఆ సీన్ షూటింగ్ జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. బాలయ్య తన చుట్టూ ఉండేవాళ్లను ఎంతో అభిమానిస్తారని.. గౌరవిస్తారని అప్పాజీ అంబరీష ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.