Moviesయావ‌రేజ్ వీర‌సింహారెడ్డికి టాప్ వ‌సూళ్లు... బ్లాక్‌బ‌స్ట‌ర్ భ‌గ‌వంత్‌కు యావ‌రేజ్ వ‌సూళ్లు... తేడా...

యావ‌రేజ్ వీర‌సింహారెడ్డికి టాప్ వ‌సూళ్లు… బ్లాక్‌బ‌స్ట‌ర్ భ‌గ‌వంత్‌కు యావ‌రేజ్ వ‌సూళ్లు… తేడా ఎక్క‌డ బాల‌య్యా ?

ఒకటి మాత్రం నిజం. బాలయ్య రెండున్నర దశాబ్దాల తర్వాత తన కెరీర్లు అదిరిపోయే హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాలలో అఖండ సినిమా రేంజ్ వేరు.. ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ వేరు.. ఆ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ప్రతి ఒక్కరు భారీ లాభాలు కళ్లజూశారు. వీరసింహారెడ్డి సినిమాకు బడ్జెట్ పెరిగింది.. బిజినెస్ ఎక్కువ జరిగింది.. బాలయ్య రెమ్యునరేషన్ కాస్త పెరిగింది. ఆ సినిమాకు కూడా ప్రతి ఒక్కరికి పెట్టిన పెట్టుబడి కంటే భారీగానే లాభాలు వచ్చాయి.

భగవంత్ కేసరి సినిమాకు వచ్చేసరికి బాలయ్య రెమ్యునరేషన్ మరో మూడు నాలుగు కోట్ల రేంజ్ లో పెరిగింది. స్టార్ దర్శకుడు.. అటు కాజల్, శ్రీలీల‌ ఉండడంతో స్టార్ కాస్టింగ్ కూడా ఎక్కువ అయింది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువే జ‌రిగింది. వాస్తవానికి అఖండలో బాలయ్య నట విశ్వరూపం చూపించేశారు. ఆ తర్వాత కంటెంట్ పరంగా చూస్తే వీరసింహారెడ్డి కంటే భగవంత్‌ కేసరిలో మంచి కథాబలం ఉంది. బాలయ్య అంటే కేవలం మాస్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇటు క్లాస్ ప్రేక్షకులు.. మహిళలు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది.

అయితే వసూళ్లు పరంగా చూస్తే భగవంత్ కేసరి రేంజ్ లోనే ఉంది మరి ఈ తేడా ఎక్కడ జరిగింది ? అన్నది విశ్లేషణ చేసుకుంటే రకరకాల కారణాలు కనిపిస్తాయి. వీరసింహారెడ్డికి సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి బాలయ్య సినిమా.. అందులోనూ చిరంజీవిలాంటి హీరోతో పోటీ అంటే అభిమానుల్లో ఏ రేంజ్ లో ఉత్సాహం ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక భగవంత్‌ కేసరి దసరాకు రిలీజ్ అయింది. ఈ సినిమాకు అటు రవితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, విజయ్ లియో సినిమాల నుంచి గట్టి పోటీయే ఉంది.

పైగా భారీ అంచనాలతో రిలీజ్ కావటంతో ఆ సినిమాకు కూడా తెలుగులో భారీ ఎత్తున థియేటర్లు దక్కాయి. క్లాస్ సెంటర్లలో లియో ఆధిపత్యం చాటుకుం.ది బీ, సీ సెంటర్లలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీనికి తోడు బాలయ్య సినిమా అంటే మంచి మంచి పాటలు.. డ్యాన్సులు కూడా ఆయన అభిమానులు, సగటు సినీ అభిమానులు ఆశిస్తారు. అవి ఈ సినిమాలో మిస్ అయ్యాయి.

దీనికి తోడు ఈసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగవంత్‌ కేసరి సినిమాకు అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇది నూటికి నూరు శాతం నిజం. అటు మెగా అభిమానులలో కొన్ని వర్గాలు విజయ్ లియోకు సపోర్ట్ చేశాయి. ఇది అంతా బాలయ్య సినిమాకు యాంటీగానే జరిగింది. దీనికి తోడు చంద్రబాబు అరెస్టు అయ్యి జైలులో ఉండడంతో బాలయ్య సినిమాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. ఇవ‌న్నీ భ‌గ‌వంత్ కేస‌రి సినిమా మంచి క‌థాబ‌లం ఉండి కూడా వీర‌సింహారెడ్డితో పోల్చుకుంటే వసూళ్ల ప‌రంగా కాస్త డౌన్ అయినా.. ఈ సినిమాకు లాంగ్ ర‌న్ ఉండేలా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news