బాలీవుడ్ ప్రేమ పక్షులు మలైకా అరోరా – అర్జున్ కపూర్ సహజీవనం గురించి తెలిసిందే. గత కొన్నేళ్లుగా సంవత్సరాల పైగా వయసు తేడా ఉంది. మలైకా వయసు 50 సంవత్సరాలకు చేరువయ్యింది. ఇటు అర్జున్ కపూర్ మలైకాకంటే 13 ఏళ్లు చిన్నవాడు. వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి.. విడిపోతున్నారు.. విడిపోయారు అంటూ చాలాసార్లు మీడియా కథనాలు వచ్చినా వీరు అవేవీ పట్టించుకోకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
పైగా విదేశాలకు వెళ్లిపోయి అక్కడ కూడా పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మలైకా విదేశాల్లో బికినీలు వేసుకుని బిచ్‌ల చుట్టూ తిరుగుతూ అర్జున్‌కపూర్‌ను వెంటేసుకుని ఎంతలా ? ఎంజాయ్ చేస్తుందో చూస్తూనే ఉంటాం. తాజాగా తన ప్రియురాలు పుట్టినరోజు కానుకగా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్న మరో ఫోటో బయటకు వచ్చింది. అక్టోబర్ 23న మలైకా పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నడి రాత్రి సమయంలో ఇద్దరు ఇలా పార్టీలో చేరి చిల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ మధ్యలో ఇద్దరూ లేచి కలిసి జంటగా ఉన్నారు. అర్జున్ కపూర్ వెనక నుంచి మలైకాను వాటేసుకోగా.. మలైకా ఆ ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. మలైకా మోయకు కపూర్ మంత్రముగ్ధుడు అయిపోయినట్టుగా ఉంది. మలైక వైట్ కాంబినేషన్ లేహంగా దుస్తుల్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
చేతి వేలికి ఇష్టమైన గ్రీన్ కాంబినేషన్ రింగ్స్ ధరించింది. అర్జున్ కపూర్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో చాలా హ్యాండ్ సమ్‌గా ఉన్నాడు. అసలు నిజంగా వీరి మధ్య ఈ రేంజ్‌లో ఏజ్ గ్యాప్ ఉందా ? అన్న అనుమానం తప్పక వస్తుంది. వీళ్లు ఈక్వల్ ఏజ్ లవర్స్‌లా ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు.