Moviesభగవంత్ కేసరి 2 పై అనిల్ రావిపూడి మైండ్ బ్లోయింగ్ హింట్.....

భగవంత్ కేసరి 2 పై అనిల్ రావిపూడి మైండ్ బ్లోయింగ్ హింట్.. నందమూరి ఫ్యాన్స్ ని ఇక ఆపగలమా..!

నందమూరి బాలయ్య రీసెంట్గా నటించిన సినిమా భగవంత్ కేసరి . అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే సినిమా అంటూ అందరూ చెప్పుకు వచ్చారు. సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేకపోవడం .. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాను బాగా లైక్ చేశారు .

ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో .. గ్రాండ్ గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఈవెంట్ లో పాల్గొన్న అనిల్ కు నందమూరి బాలయ్య ఫ్యాన్స్ నుంచి టఫ్ క్వశ్చన్ ఎదురైంది . భగవంత్ కేసరి హిట్ అయింది ..భగవంత్ కేసరి 2 సినిమాను తెరకెక్కించే ఆలోచనలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు.

దీంతో అనిల్ క్లారిటీ ఇస్తూ “ఈ బరువు మోసినందుకే చాలా చాలా నలిగిపోయాను.. సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకు ఇస్తే ఖచ్చితంగా తీస్తాను..అది కూడా వెంటనే అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు “. అంటే బాలయ్య ఓకే చెప్తే అనిల్ రావిపూడి భగవంత్ కేసరి టు కూడా తీసే ఆలోచనలోనే ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . భగవంత్ కేసరి 2 వస్తే మాత్రం సినిమా మరింత స్థాయిలో హిట్ అవుతుంది అని చెప్పక తప్పదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news