సినిమా ఇండస్ట్రీలో ప్రేమించడం .. మోసం చేయడం చాలా చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఇలాంటివి అస్సలు పట్టించుకోరు.. కంటికి కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూ ఇష్టంగా దగ్గర తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు . వన్స్ మ్యాటర్ ఫినిష్ చేశాక ఆ అమ్మాయిని వదిలేస్తూ వదిలించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లలో మన టాలీవుడ్ తెలుగు హీరో కూడా ఉన్నాడు అన్న వార్త అప్పట్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఓ హీరో తెలుగులో ఉండే ఓ యాంకర్ తో ప్రేమాయణం కొనసాగించాడని ..ఆమెను పూర్తిగా వాడేసుకొని పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చి వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడని .. కానీ ఆ యాంకర్ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతూ ఆ హీరోనే నమ్ముకుని యాంకర్ మోసపోయాను అన్న బాధతో ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.
అంతేకాదు ఇదే విషయాన్ని పలుసార్లు పలు యాంకర్లు పరోక్షంగా ఆ హీరోని ప్రశ్నించిన ఏది తెలియదన్నట్లు సైలెంట్గా ముఖం తిప్పుకొని వెళ్లిపోయాడు . ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం కావడంతో పెద్దగా ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. అలాంటి హీరోలు చాలా మందే ఉన్నారు అంటున్నారు ఇందస్ట్రీలో ఉండే జాన్లు..!!