Newsస్టార్ హీరోయిన్ న‌య‌న‌తార సినిమాల్లోకి రాక‌ముందు ఆ ప‌నులు చేసేదా..!

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార సినిమాల్లోకి రాక‌ముందు ఆ ప‌నులు చేసేదా..!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా దూసుకుపోతుంది. ఒకప్పుడు సాధారణ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈరోజు సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా రికార్డుల్లో ఉన్నారు. అలాగే షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాతో నయనతార క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఉంది.

నయనతార మలయాళీ అమ్మాయి. ఆమెను తెలుగు – తమిళ సినీ జనాలు తిరుగులేని స్టార్ హీరోయిన్గా చేసేసారు. త‌మిళ హీరోలు ప్ర‌భుదేవా, శింబుతో ప్రేమాయ‌ణాలు న‌డిపి చివరకు వయసులో తనకంటే చిన్నోడు అయినా డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే నయనతార సినిమాల్లోకి రాకముందు తన కెరీర్ ను టీవీ యాంకర్ గా ప్రారంభించింది
అనే విషయం చాలామందికి తెలియదు.

నయనతార యాంకర్ గా పనిచేస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అప్పట్లో ఆమె లుక్స్ చూసి చాలామంది నెటిజన్లు షాక్ అవుతారు. అసలు వీడియోలో ఉన్నది నయనతారేనా.. అప్పటి నయనతారకు ఇప్పటి నయనతారకు అసలు పోలిక లేదని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక తాజాగా నయనతార షారుక్ కు జోడిగా చేసిన జవాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టింది..

అయినా కూడా డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో మరో హీరోయిన్ దీపికను హైలెట్ చేసి తనను సైడ్ చేసినందుకు చాలా కోపంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అతిథి పాత్రలో నటించిన దీపికతో పోలిస్తే ఈ సినిమాలో తన పాత్ర విషయంలో నయనతార సంతోషంగా లేదని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ సినిమాలలో అస్సలు నటించకూడదని కూడా నిర్ణయం తీసుకుందట.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news