టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం మహేష్ బాబు నుంచి సర్కారు వారి పాట సినిమా తర్వాత ఇటు త్రివిక్రమ్ నుంచి అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై మాములు అంచనాలు లేవు. దీనికి తోడు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో 2010లో వచ్చిన ఖలేజా సినిమా అంటే 13 సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అంచనాలు మామూలుగా లేవు.
ఈ 13 సంవత్సరాల లో ఇటు మహేష్ బాబు ఇమేజ్.. అటు త్రివిక్రమ్ ఎంతో పెరిగింది. దీంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ అభిమానులే కాదు.. సగటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు.
అయితే అనుహ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ డేట్లు అనూహ్యంగా మారుతున్నాయి. సెప్టెంబర్ 28న రిలీజ్ కావలసిన ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ డిసెంబర్ 22న వస్తున్నట్టు ప్రకటించారు. దీనికి తోడు డిసెంబర్లో రావలసిన వెంకటేష్ సైంధవ్, నితిన్, నాని సినిమాలు కూడా రెండు వారాలు ముందుకు జరుగుతున్న పరిస్థితి. మరోవైపు గుంటూరు కారంతో పాటు నాగార్జున నా సామిరంగా, రవితేజ ఈగల్ – తేజ సజ్జ హనుమాన్ సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి.
ఈ క్రమంలోనే జనవరి 12న రిలీజ్ కావలసిన గుంటూరు కారం సినిమాను ఒకరోజు ముందుకు జరిపి జనవరి 11న రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది. గుంటూరు కారం జనవరి 11న రిలీజ్ అయితే.. హనుమాన్ జనవరి 12న, నాగార్జున నా సామిరంగా, రవితేజ ఈగిల్ సినిమాలు 13, 14 తేదీలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.