Moviesబిగ్ బాస్ 7: హౌస్ లో టూ మచ్ ఓవర్ చేస్తున్న...

బిగ్ బాస్ 7: హౌస్ లో టూ మచ్ ఓవర్ చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..? చిన్నపిల్లాడిని అడిగిన అదే మాట..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ కు సంబంధించిన మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అది రైల్వే స్టేషన్లో కాదు .. బస్ స్టేషన్ లో కాదు ..మెట్రో స్టేషన్ లో కాదు ఇంట్లో సరదాగా ఆడవాళ్ళు చెప్పుకునే కబుర్లలోనూ కాదు ..అన్ని చోట్ల సరే బిగ్ బాస్ కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాం.. రీసెంట్ గానే తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయింది . ఎప్పటిలాగే ఈ సీజన్ ను నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.

కాగా ఈసారి కూడా డమ్మి కంటెస్టెంటల్ను తీసుకొచ్చారు అని జనాలు ఫైర్ అవుతున్నారు . అయితే ఉన్న హౌస్ మెట్స్ అందరిలోకి ఓ కంటెస్టెంట్ మాత్రం ఓవర్ చేస్తున్నారని .. అతిగా చేస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు శివాజీ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్న ఈయన తర్వాత రాజకీయాలలోనూ వేలు పెట్టి ..తనదైన స్టైల్ లో చక్రం తిప్పాడు .

ఆ తైం లో బూతులు తిట్టాడు ..బూతులు తిట్టించుకున్నాడు కూడా .. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన నేనే తోపు నేనే తురుము అన్నంత రేంజ్ లో దూసుకెళ్లిపోతున్నాడు . అయితే ఇతగాడు కావాలనే ఇలా చేస్తున్నాడు అని ఇలా హంగామా చేస్తే బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకుంటున్నాడని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అసలు ఈ శివాజీ గాడిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయండి .. ఓవర యాక్షన్ చూడలేకపోతున్నాం అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఖచ్చితంగా అతి త్వరలోనే శివాజీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం పక్క అంటున్నారు జనాలు..!!

Latest news