ప్రస్తుతం సినిమా రంగంలో పెళ్లికి ముందే ప్రతి ఒక్కరు డేటింగులు.. సహజీవనాలు చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా పెద్దలు కుదిర్చిన లేదా అరేంజ్డ్ మ్యారేజ్ లు అస్సలు చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా పెళ్లికి ముందే ప్రేమలో పడి కొద్ది రోజులు పాటు డేటింగ్ లో ఉండటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం కామన్ గా జరుగుతుంది. ఒకప్పుడు ఈ కల్చర్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది.. అయితే ఇప్పుడు ఇది సౌత్ కూడా బాగా పాకేసింది.
సౌత్ సినీ సెలబ్రిటీలు అందరూ పెళ్లికి ముందే డేటింగులలో మునిగితేలుతూ ఆ తర్వాత వారి అండర్స్టాండింగ్ బాగుంటే పెళ్లి చేసుకుంటున్నారు.. లేదా అక్కడితో బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని క్రేజీ జంటలు కూడా డేటింగ్ లో మునిగితేలుతున్నయంటూ సోషల్ మీడియా సర్కిల్స్‌లో ఒకటే ప్రచారం జరుగుతుంది. వారిలో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్మిక రష్మిక మందన్న గురించి.. ఈ ఇద్దరు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్నారు.
ఇటీవల వీరిద్దరూ కలిసి మాల్దీవులకు కూడా వెళ్లారు.. ఓకే ప్లేస్ లో వేరువేరుగా దిగిన ఫోటోలు కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు. అలాగే రష్మిక లైవ్ చాట్ లోకి రావడం అనుకోకుండా విజయ్ వాయిస్ వినిపించడం… మొన్న హైదరాబాద్‌కు వచ్చిన రష్మిక విజయ్ ఇంటి గార్డెన్లో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇలా చాలాసార్లు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా విజయ్ దేవరకొండ 12వ సినిమాలో ముందుగా శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైన తర్వాత ఆమె ప్లేస్ లో రష్మికను తీసుకున్నారు.
దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో మునిగి తేలుతున్నారు అన్న పుకార్లకు మరింత బలం వచ్చినట్లయింది. ఇక హీరోయిన్ అదితీరావు హైదరి తమిళ హీరో సిద్ధార్థ ఎప్పటినుంచో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికి పెళ్లిళ్లు అయ్యి విడాకులు కూడా అయిపోయాయి. ఇక మరో ప్రేమ జంట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న – బాలీవుడ్ ప్రియుడు విజయ వర్మ కలిసి డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ మిల్కీ బ్యూటీ ఇప్పటివరకు సినిమాల్లో ఒకరితో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం విజయ్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సీన్లలో ఘాటుగా నటించింది. అలాగే తామిద్దరం డేటింగ్ లో ఉన్నామంటూ ప్రకటించి తమపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేసింది. మరి ఈ మూడు జంటలు పెళ్లి వరకు వెళతాయా లేదా అన్నది చూడాలి.