Newsటాలీవుడ్‌లో ప‌ర‌మ వ‌ర‌స్ట్ కాంబినేష‌న్లు ఇవే...చిరు, వెంకీ, మ‌హేష్ బాధితులే...!

టాలీవుడ్‌లో ప‌ర‌మ వ‌ర‌స్ట్ కాంబినేష‌న్లు ఇవే…చిరు, వెంకీ, మ‌హేష్ బాధితులే…!

ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమా కథ, కథనం, పాటలు డైలాగులతో పాటు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. అయితే టాలీవుడ్ లో కొన్ని జంటలు తెరమీద చూస్తుంటే నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న ఫీలింగ్ వస్తుంది. మరి కొన్ని జోడీలు మాత్రం అస్సలు సెట్ అవ్వలేదనిపిస్తుంది. అలాంటి సినిమాలు కథలు బాగున్నా ఆ కథతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటానికి ఇబ్బంది పడతారు. తెలుగులో కొన్ని జంటలు తెరమీద రొమాన్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు చాలా ఇబ్బందిగా ఫీలవడంతోపాటు ఇదేం కాంబినేషన్ రా బాబు ? అని తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

మరి అలాంటి సినిమాలు.. అలాంటి జంటలు ఏవో ? చూద్దాం.
1- చిరంజీవి – త్రిష :
చిరంజీవి – త్రిష కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథపరంగా చాలా బాగున్న చిరంజీవి – త్రిష లవ్ ట్రాక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.
2- మ‌హేష్‌బాబు – ర‌ష్మిక :
ఇటీవల కాలంలో మహేష్ బాబు – రష్మిక కాంబినేషన్లో వచ్చిన సరిలే నీకెవ్వరు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు సెట్ అవ్వలేదు. ముఖ్యంగా సుదీర్ఘంగా కొనసాగిన ట్రైన్ ఎపిసోడ్ లవ్ ట్రాక్ అయితే పరమ బోరింగ్ అనేలా ఉంది.

3- వెంక‌టేష్ – పాయ‌ల్ రాజ్‌పుత్ :
ఇక వెంకటేష్ – నాగ చైతన్య కలిసి చేసిన మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా పాయల్ రాజ్‌పుత్‌ నటించింది. వీళ్ళ జోడి కూడా అట్టర్ ప్లాప్ అని చెప్పాలి. వీళ్ల ల‌వ్ ట్రాక్ ఈ సినిమాకు పెద్ద మైనస్.

4- విక్ర‌మ్ – కీర్తి సురేష్ :
తమిళ హీరో విక్రమ్ – కీర్తి సురేష్ కలిసి నటించిన సామీ స్క్వేర్ అట్ట‌ర్ ప్లాప్‌. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేదు స‌రిక‌దా… వీరిద్ద‌రి ల‌వ్ ట్రాక్ ప‌ర‌మ చెత్తగా ఉంది.
5- అఖిల్ – నిధి అగ‌ర్వాల్ :
మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో నిధి అగ‌ర్వాల్ – అఖిల్ ల‌వ్ ట్రాక్ అస్స‌లు సెట్ కాలేదు. ఇది ఫ్యూర్ ల‌వ్ స్టోరీ అయినా ఈ సినిమా కెమిస్ట్రీ అట్ట‌ర్ ప్లాప్‌.


6- అల్లు అర్జున్ – భాను శ్రీ మెహ్రా :
ఇక గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వ‌రుడు సినిమాలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అస్స‌లు సూట్ కాలేదు. ఈ సినిమా ప‌రాజ‌యానికి ఇదో ముఖ్య కార‌ణం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news