టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నాగార్జున టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో సినిమాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే జయువ సామ్రాట్, మన్మథుడిగా పేరు తెచ్చుకుని తన తండ్రిని మించిన హీరోగా ఎదిగాడు.
ఇక నాగార్జున తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో సినిమాలు చేస్తూ వారితో సన్నిహితంగా ఉండేవాడు. ఆ సమయంలో టాలీవుడ్ లో లేడీ మ్యాన్ అనే పేరు కూడా నాగార్జునకు వచ్చింది. అదేవిధంగా తన సినీ కెరీర్లో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నాడని వార్తలు కూడా వస్తూ ఉంటాయి. హీరోయిన్లతో ఎంతో చనువుగా ఉండే నాగార్జున ఏ హీరోయిన్ కి ఎప్పుడో భయపడలేదు.. కానీ ఓ హీరోయిన్ కు మాత్రం ఎంతో భయపడ్డారట.
ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. నాగార్జున- శ్రీదేవి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో రెండు హిందీ సినిమాలు.. రెండు తెలుగు సినిమాలు. తెలుగులో వీరిద్దరూ గోవిందా గోవిందా, ఆఖరి పోరాటం సినిమాల్లో నాగార్జున- శ్రీదేవి జంటగా నటించిన సమయంలో నాగ్ ఆమెను చూసి ఎంతో భయపడ్డారట.
అందుకు ప్రధాన కారణం అప్పటికే శ్రీదేవి టాలీవుడ్ లో అగ్ర హీరోలు అయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి అగ్ర నటులతో హీరోయిన్గా నటించి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. అలాంటి హీరోయిన్‌తో నేను నటించగలనా అని ప్రతిసారి కూడా నాగార్జున భయపడేవారట. ఈ విధంగా నాగార్జున తన కెరీర్లో ఒక శ్రీదేవితో నటించడానికి మాత్రం ఎంతో భయపడ్డాడట. అయితే శ్రీదేవి కోపరేషన్‌తో నాగ్ ఆమెతో రెండు సినిమాలలో నటించాడు. ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.