Newsశ్రీలంక స్టార్ క్రికెట‌ర్ ముర‌ళీధ‌ర‌న్ పేవ‌రెట్ తెలుగు హీరో ఎవ‌రంటే... ఊహించ‌ని...

శ్రీలంక స్టార్ క్రికెట‌ర్ ముర‌ళీధ‌ర‌న్ పేవ‌రెట్ తెలుగు హీరో ఎవ‌రంటే… ఊహించ‌ని పేరు..!

భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండ్ క్రికెటర్ మొత్తం మురళీధర‌న్‌. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అయిన మురళీధర్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 800. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయనే. ఆ రికార్డును గుర్తుచేసేలా ఆయన బయోపిక్ కు ఆ టైటిల్ పెట్టారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ తెలుగు నిర్మాత శ్రీదేవి మూవీ పిక్చర్ అధినేత శివలెంక‌ కృష్ణ ప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా తెలుగు మీడియాతో మురళీ ముచ్చటించారు. ఇక ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగిలిన 80% అంతా నా లైఫ్ ఉంటుంది.. నా ప్రయాణం నేను సాధించిన ఘనతలు ఈ క్రమంలో నా కుటుంబం.. దేశం ఎదుర్కొన్న పరిస్థితులు చూపించాం.. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు ఇలాంటి అంశాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. ఇక మీరు తెలుగు సినిమాలు చూస్తారా ? అన్న ప్రశ్నకు శ్రీలంకలో తెలుగు సినిమాలు రిలీజ్ కావు.. తమిళ, హిందీ సినిమాలు విడుదలవుతాయి.. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తా అని తెలిపారు.

ఇక బాహుబలి, త్రిబుల్ ఆర్‌, పుష్ప సినిమాలు పాన్‌ ఇండియా భాష‌ల‌లో రిలీజ్ చేశారు. అవి హిందీ భాషల్లో కూడా విడుదల చేయడంతో ఆ సినిమాలు చూశానని మురళీధర్ ని తెలిపారు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోంది.. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్.. అక్కడ వాళ్లకు హిందీ తెలుసు.. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారింది.. తెలుగు సినిమా టాప్‌ పొజిషన్కు చేరుకుందని చెప్పాడు.

ఇక తెలుగులో నాని సినిమాలు తాను ఎక్కువగా చూశానని శ్యాం సింగరాయ – ఈగ – జెర్సీతో పాటు నాని నటించిన చాలా సినిమాలు చూసినట్టు మురళీధరన్ చెప్పారు. నాని నటన అంటే తనకు చాలా ఇష్టం నాని యాక్షన్ హీరో కాదు అతడి సినిమాలలో డ్రామా, ఎమోషన్లు కూడా ఉంటాయి అతడు నేచురల్ స్టార్ అంటూ మురళీధర‌న్‌ కీర్తించారు. ఏది ఏమైనా ప్రపంచ స్థాయి క్రికెటర్ మురళీధరన్‌ ప్రశంసలు దక్కటం అంటే నాని నిజంగా లక్కీ పర్సన్ అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news