సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలి అంటే కొందరు డైరెక్టర్లు ..ప్రొడ్యూసర్లు ..హీరోలని సుఖ పెట్టాల్సిందే అని ..వాళ్ళ కోరికలు తీర్చాల్సిందే అని ఇప్పటికే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎంతోమంది హీరోయిన్స్ బయట పెట్టారు . అయితే కేవలం ఇలాంటి సమస్యలు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి మాత్రమే కాదని సింగర్స్ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది సూపర్ స్టార్ సింగర్ ప్రణవి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రణవి ఎన్నో మంచి మంచి పాటలు పాడి అభిమానులు చేత శభాష్ అనిపించుకుంది. మరీ ముఖ్యంగా ప్రణవి పాటలు పాడితే చాలు వినడానికి హాయిగా ఉంటుంది అని .. మనసు ప్రశాంతంగా ఉంటుంది అని .. చాలామంది జనాలు చెప్పుకొస్తూ ఉంటారు.
కాగా కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణవి ఓ పాపకు జన్మనిచ్చింది . ప్రజెంట్ మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న ప్రణవి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ స్టార్టింగ్ లో పడిన ఇబ్బందుల గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఆమె మాట్లాడుతూ ..”కెరియర్ స్టార్టింగ్ లో నన్ను ఓ డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టాడు. నా గొంతు బాగుంది అంటూ మెచ్చుకున్నాడు. అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశారు. అయితే తాను సినిమాలో పాట పాడాలి అంటే ఓ రోజు మొత్తం తనతో గడపాలి అంటూ కండిషన్ పెట్టాడు”.
” అప్పుడే నాకు మ్యాటర్ అర్థమైంది ..చెప్పు తెగిపోద్ది ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అంటూ వార్నింగ్ ఇచ్చి మరి లేచి వచ్చేసాను “అంటూ చెప్పుకు వచ్చింది . కేవలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటేనే కాదు అమ్మాయిలు ఏ ఫీల్డ్ లో అయినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే అని మరోసారి బయటపడింది . దీంతో సోషల్ మీడియాలో ప్రణవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ టాప్ తెలుగు డైరెక్టర్ ఎవరా..? అంటూ ఆరా తీస్తున్నారు..!!