News"నాగ చైతన్యతో ఉన్న ప్రైవేట్ పిక్ ని షేర్ చేసిన సమంత".....

“నాగ చైతన్యతో ఉన్న ప్రైవేట్ పిక్ ని షేర్ చేసిన సమంత”.. మళ్లీ ప్రేమ పుట్టిందా బేబీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. అందం నటన విషయంలో ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉండే సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఏ మాయ చేసావే సినిమా ద్వారా హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న ఈ ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకోవడం అభిమానులకు బాగా నచ్చేసింది . అయితే కొంత కాలం బాగానే సాగిన కాపురం ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా చిన్న భిన్నం అయిపోయింది . వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు వాళ్ల ప్రేమను బ్రేకప్ చెప్పేలా చేశాయి.

పెళ్లి బంధాన్ని విడాకులతో తెంచేసుకున్నారు . వీళ్లు విడాకులు తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా చాలా బాధపడిపోయారు. అయితే విడాకుల తర్వాత వీళ్ళ మధ్య జరిగిన కొన్ని పరోక్ష ట్విట్టర్ వార్ ఎంత వైరల్ అయిందో కూడా మనం చూసాం. నాగచైతన్య ఏమి అనకపోయినప్పటికీ సమంత పలు షోస్ లో పలు విధాలుగా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడింది. కాగా ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య తో పెళ్లి చేసుకున్న ఫొటోస్ ను సమంత తన ఇన్స్టా నుండి కనిపించకుండా ఆర్చివ్ లో పెట్టింది .

ప్రస్తుతం సమంత చైతన్య ఎవరి దారి వాళ్లది అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నారు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది సమంత. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా సమంత ఇంస్టాగ్రామ్ లో మళ్ళీ నాగచైతన్యతో ఉన్న పెళ్లి ఫోటో ఒకటి ప్రత్యక్షమైంది. అందులో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న సామ్ – చై ఘాటుగా ముద్దు పెడుతున్నట్లు ఉంది . దీంతో ఇది చూసిన నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు . ఇన్నాళ్లకు మళ్ళీ నీకు మొగుడు మీద ప్రేమ పుట్టిందా..? చై గుర్తొచ్చాడా..? అంటుంటే.. మరికొందరు సమంత చైతన్యని మిస్ అవుతుందని.. అందుకే ఈ ఫోటో మళ్లీ ఆర్చివ్ నుండి తీసేసిందని చెప్పుకొస్తున్నారు. సమంత పెళ్లి ఫోటో మళ్లీ దర్శనం ఇవ్వడంతో అభిమానులు ఏం జరగబోతుందో వీళ్ళ మధ్య అంటూ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మరికొందరు మాత్రం వ్యంగ్యంగా సమంత ను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news