Newsశ్రీలీల‌పై ర‌గిలిపోతున్న ర‌ష్మిక‌... ప‌ళ్లు నూరుతూ ప‌ట్ట‌రాని కోపం...!

శ్రీలీల‌పై ర‌గిలిపోతున్న ర‌ష్మిక‌… ప‌ళ్లు నూరుతూ ప‌ట్ట‌రాని కోపం…!

ఎస్ ప్రస్తుతం ఇదే మేటర్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో బాగా హాట్‌ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలపై కన్నడ కస్తూరి రష్మిక మందన్న బాగా రగిలిపోతోందట. రష్మిక తెలుగులో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చాక తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మధ్యలో కరోనాతో రెండు సంవత్సరాలు వేస్ట్ అయ్యాయి కానీ.. లేకపోతే ఆ రెండేళ్లలోనే రష్మిక తెలుగులో ఇంకెన్నో సూపర్హిట్లు చేసి ఉండేది.

మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు – బన్నీతో పుష్ప 1 సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో ఛాన్సులు దక్కించుకొని సూపర్ హిట్లు కొట్టింది. ఎప్పుడు అయితే శ్రీలీల‌ ఎంటర్ అయిందో.. ఆప్పటి నుంచి ర‌ష్మిక తో పాటు పూజా హెగ్డే ఇద్దరు అవుట్ అవుతున్నారు. రష్మిక టాలీవుడ్‌ను కాస్త చిన్నచూపు చూస్తూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమె చేసిన మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో బలంగా జండా పాతేద్దాం అనుకుంటున్నా శ్రీలీల ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు.

అటు స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోలు చివరకు వైష్ణవ్‌ తేజ్ లాంటి హీరోల సినిమాలలో కూడా శ్రీలీల హీరోయిన్. ఇప్పుడు శ్రీలల చేతిలో ఏకంగా బాలయ్య, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్‌ తేజ్, నితిన్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. రవితేజ, నితిన్ అయితే వరుసగా తమ సినిమాలలో శ్రీలీలనే రిపీట్ చేస్తున్న పరిస్థితి. తాజాగా రామ్ కు జోడిగా స్కంద‌ సినిమాలోని మెరిసింది. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోలు దర్శక, నిర్మాతలు కూడా ఇప్పుడు తమ సినిమాలో శ్రీలీల‌ ఉంటేనే సినిమాకు క్రేజ్ పెరగడంతో పాటు సినిమా బిజినెస్ కూడా పెరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే అందరూ శ్రీలీల వెంటే పడుతున్నారు.

ఆమె రాత్రి, పగలు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసిన కూడా ఆమె డిమాండ్ మామూలుగా లేదు. మరోవైపు ర‌ష్మిక చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. విజయ్ దేవరకొండ సినిమాలో రాకరాక చాన్స్ వచ్చింది. ఆ సినిమాలో కూడా ముందుశ్రీలీలను హీరోయిన్గా తీసుకొని ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక నో చెప్పడంతో గ‌తిలేక రష్మికను తీసుకున్నారు. అందులోనూ విజయ్ దేవరకొండ – రష్మిక క్రేజీ కాంబినేషన్ కావడంతో విజయ్ పట్టుబట్టి రష్మిక వైపు మొగ్గుచూపితే కానీ ఆ ఛాన్స్‌ కూడా రాలేదు.

ఇక శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే అయితే ఎప్పుడో అవుట్ అయిపోయింది.. అసలు పూజ హెగ్డేను టాలీవుడ్‌లో పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. ఇక ఇప్పుడు ర‌ష్మికది కూడా అదే పరిస్థితి. దీంతో తన ఛాన్సులు మొత్తం లాగేసుకుంటున్న శ్రీలీలపై రష్మిక బాగా రగిలిపోతున్నట్టు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో బాగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా శ్రీలీల‌ ఇదే దూకుడు మరో రెండేళ్లు కంటిన్యూ చేస్తే రష్మిక ఈ రెండేళ్లలోనే తెలుగులో త‌ట్టాబుట్టా స‌ర్దేసుకోవ‌డం కాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news