Newsనా భ‌ర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ర‌వీంద్ర‌పై కోలీవుడ్ న‌టి...

నా భ‌ర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ర‌వీంద్ర‌పై కోలీవుడ్ న‌టి మ‌హాల‌క్ష్మి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

కోలీవుడ్ యంగ్ బ్యూటీ మహాలక్ష్మి ఒకప్పుడు ఫేమస్ కాలేదు. ఎప్పుడు అయితే భారీ కాయుడు అయిన నిర్మాత రవీందర్ చంద్రశేఖరను పెళ్లి చేసుకుందో ఒక్కసారిగా ఫేమస్ అయింది .అంత బరువు.. అంత లావు ఉన్న నిర్మాతను ప్రేమించి ఏరి కోరి మరి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్ ను పెళ్లి చేసుకుందని.. ఆమెకు ఎంత మాత్రం భర్తపై ప్రేమ లేదని ఆస్తి, నగలు కోసమే ప్రేమ పేరుతో రవీందర్ ను వలలో వేసుకుందని విమర్శించారు.

తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని ఈ జంట యేడాది పాటు చాలా హ్యాపీగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలోనే రవీందర్ మహాలక్ష్మికి ఎన్నో కాస్ట్‌లీ గిఫ్టులు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నాడు. మహాలక్ష్మి ఈ యేడాదిలో భర్తతో కలిసి మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. అయితే ఉన్నట్టుండి చీటింగ్ కేసులో రవీందర్ జైలుకు వెళ్ళాడు.. ఇప్పుడు భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధ లేకుండా మహాలక్ష్మి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.

ఇది కూడా ఇప్పుడు తమిళ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. అయితే తాజాగా మహాలక్ష్మి తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆమె సన్నిహితులు ముందు వాపోయినట్టు తెలుస్తుంది. పెళ్ళికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకు ఏమి చెప్పలేదు.. చీటింగ్ కేసులు, డబ్బులు విషయాలు మా మధ్య రాలేదు.. నాకు అన్ని అబద్ధాలు చెప్పి మోసం చెప్పి పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆమె వాపోయిందట.

దీంతో ఈ వ్యాఖ్యలపై తమిళ సినీ జనాలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా సైలెంట్ గా ఉండి భర్త డబ్బుతో ఎంజాయ్ చేసి.. భర్త ఇచ్చిన కాస్ట్‌లీ గిఫ్టులు తీసుకుని ఇప్పుడు అతడు జైల్లో ఉంటే మోసం చేశాడు అనటం మహాలక్ష్మి మోస బుద్ధికి నిదర్శనం అని.. ఆమె కచ్చితంగా డబ్బు కోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుందని గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news