News' స్కంధ ' షూటింగ్‌లో రామ్ అంత ఓవ‌ర్ చేశాడా... శ్రీలీల‌ను...

‘ స్కంధ ‘ షూటింగ్‌లో రామ్ అంత ఓవ‌ర్ చేశాడా… శ్రీలీల‌ను ఇబ్బంది పెట్టాడా…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, క్రేజీ హీరోయిన్ కలిసి నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతుంది. వీళ్ళిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్. గతంలో కూడా ఎప్పుడు ప‌రిచ‌యం కూడా లేదు. తొలిరోజు వీళ్ళిద్దరి మధ్య షూటింగ్ ఎలా ?నడిచింది ఇదే ప్రశ్న శ్రీలీలకు ఎదురైతే దీనిపై ఆమె ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

స్కంద సినిమా షూటింగ్ మొదటి రోజు దూరం దూరంగా ఉన్నాము.. ఇటు ఫ్యామిలీతో నేను.. అటు రామ్ ఉంటాము రామ్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు.. తొలిరోజు కదా హాయ్ చెబుదామని ట్రై చేశాను.. కళ్ళ అద్దాలు పెట్టుకోవడంతో రామ్ ఎటు చూస్తున్నారో ? నాకు అర్థం కావడం లేదు. షాట్ అయిన తర్వాత కలిసాను చాలాసేపటి నుంచి హాయ్ చెబుతున్నానని.. నాకు నేనే హాయ్‌ చెప్పుకోవాల్సి వచ్చింది.. అది చాలా ఫన్నీగా అనిపించిందని శ్రీలీల తెలిపింది.

ఇది చాలా కామెడీగా ఉంది.. నా లైఫ్ లో నేనే పెద్ద కమెడియన్ వేరే వ్యక్తి అక్కర్లేదు అని శ్రీలీల చెప్పింది. అంటే తొలిరోజు రామ్ ఎంత నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకున్న ఇటువైపు హీరోయిన్ శ్రీలీల హాయ్ చెబుతుంటే అది కూడా గమనించ లేదా కావాలని కాస్త ఓవర్ చేశాడా ? అని నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. మామూలుగానే రామ్ బిహేవియర్ కాస్త ఓవర్గా ఉన్నట్టు ఉంటుంది.

అందులో హీరోయిన్ల విషయంలో ఇంకాస్త ఎక్కువ చేసి చేస్తాడని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీలీల విషయంలో తొలిరోజు అలాగే బిల్డప్ ఇచ్చి ఉంటాడన్న కామెంట్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఇక శ్రీలీల విషయానికి వస్తే ఈరోజు స్కంద సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తోంది. వచ్చే నెలలో బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news