సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఆయన పేరుకి మరింత పాపులారిటి దక్కింది . రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా ద్వారా ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి మరింత స్థాయిలో ఆయన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు రాజమౌళి .
కాగా చాలామంది స్టార్ హీరోలు రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు . అయితే రాజమౌళి మాత్రం ఓ హీరోతో సినిమా చేయాలని ఆశపడుతున్నాదు. ఆ అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోను అని.. ఆ హీరోతో సినిమా తెరకెక్కించడం తన డ్రీమ్ అని చెప్పుకు వచ్చారు. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య . ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్న తారక్ – చరణ్ అంటే ఆయనకు ఇష్టమని చెప్పుకొస్తున్న.. రాజమౌళికి హీరో సూర్య నటన చాలా చాలా నచ్చుతుందట .
చాలా న్యాచురల్ గా జెన్యూన్ గా ఉంటుంది అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . అంతేకాదు ఆయనతో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాను అని .. కానీ ఆయనతో తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ ఇంకా నా వద్ద లేదని.. వన్స్ అన్ని సెట్ అయితే కచ్చితంగా ఆయనతో సినిమా తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో..?