Moviesఫ్యామిలీకి అస్సలు నచ్చని పని చేయబోతున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కలలో...

ఫ్యామిలీకి అస్సలు నచ్చని పని చేయబోతున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా స్టార్ హీరోలుగా మారిన పాన్ ఇండియా హీరోలుగా మారి ఇండియన్ ఫిలిం హిస్టరీ కి గ్లోబల్ అవార్డులు .. ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు మిగతా హీరోలు అందరూ దిగదుడుపే అని చెప్పాలి . ఆయనకున్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఏ హీరో సాటిరారు అని చెప్పడంలో సందేహం లేదు. ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన సినిమాలను త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే పనిలో నిమగ్నం అయ్యాడు.

రీసెంట్ గానే ఆయన నటించిన బ్రో సినిమా రిలీజ్ అయింది . హిట్టు కాదు ఫట్టు కాదు మీడియం యావరేజ్ గా మారింది . ఈ సినిమా పై ఆడియన్స్ ఎలా స్పందించారో మనకు తెలిసిందే. కాగా ప్రెసెంట్ ఓ జి – హరి హర వీరమల్లు సినిమాలో ఆయన ఖాతాలో ఉన్నాయి . అయితే ఈ సినిమాలు కంప్లీట్ కాకముందే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ టోటల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చూస్ చేసుకున్నారట . కెరియర్ లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలోని నెగిటివ్గా కనిపించలేదు. బద్రి సినిమాలో నెగిటివ్ రోల్ కనిపించిన లాస్ట్ కి అది కూడా పాజిటివ్గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టోటల్ నెగిటివ్ యాంగిల్ లోనే కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ కి ఆ సరదా కూడా తీర్చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఫ్య్నాస్ నీ పవన్ కళ్యాణ్ నెగటివ్ షెడ్స్ లో చూస్తే ఎలా ఫీల్ అవుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news